తక్కువ అంచనా వెయ్యొద్దు!  | Fateh Teaser: Sonu Sood Starrer Action Thriller Looks Horrifying | Sakshi
Sakshi News home page

తక్కువ అంచనా వెయ్యొద్దు! 

Published Sun, Mar 17 2024 12:12 AM | Last Updated on Sun, Mar 17 2024 12:12 AM

Fateh Teaser: Sonu Sood Starrer Action Thriller Looks Horrifying - Sakshi

సోనూ సూద్,జాక్వెలిన్‌ 

నెగటివ్‌ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫతే’. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ని ‘వచ్చేస్తున్నా’ అంటూ శనివారం విడుదల చేశారు సోనూ సూద్‌. సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్‌ స్పష్టం చేస్తోంది.

కాగా.. టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా ‘నెవర్‌ అండర్‌ఎస్టిమేట్‌ ఎ నోబడీ’ అని పెట్టారు. అంటే.. ఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు అని అర్థం. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్‌. భారతదేశానికి చెందినవారితో పాటు పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సైబర్‌ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement