
'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠీ. గతేడాది 'చావు కబురు చల్లగా' సినిమాతో అలరించిన లావణ్య ప్రస్తుతం 'హ్యాపీ బర్త్‌డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా అలరించనుంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆద్యంతం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంది. ఇంటింటికి గన్ను.. ఎదురులేని ఫన్ను.. వంటి పలు డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చెర్రీ, హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు.
చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో !
Comments
Please login to add a commentAdd a comment