హారికకు తొలి గెలుపు
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉక్రెరుున్ గ్రాండ్‌మాస్టర్ జుకోవాతో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 34 ఎత్తుల్లో గెలిచింది. సారాసదత్ (ఇరాన్)తో తొలి గేమ్‌ను, పొగొనినా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... నినో బత్సియాష్‌విలి (జార్జియా)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో ఓడిపోరుుంది.