హారిక గెలుపు మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ | Harika win the Women's Grand Prix chess tournament | Sakshi

హారిక గెలుపు మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ

Sep 24 2013 1:15 AM | Updated on Sep 1 2017 10:59 PM

హారిక గెలుపు మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ

హారిక గెలుపు మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎలీనా డానిలియెన్

తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎలీనా డానిలియెన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఐదో రౌండ్‌లో హారిక 42 ఎత్తుల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి వరుసగా రెండో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ మహిళల మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను హంపి 52 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఐదో రౌండ్ తర్వాత హారిక, హంపి నాలుగేసి పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు. మంగళవారం జరిగే ఆరో రౌండ్‌లో హంపితో హారిక పోటీపడుతుంది. అంతర్జాతీయ టోర్నీల్లో హారిక, హంపి ముఖాముఖిగా మూడుసార్లు తలపడగా... మూడు గేమ్‌లూ ‘డ్రా’గానే ముగిశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement