హారికకు రెండు స్వర్ణాలు
మరో రెండు రజతాలు కూడా
ఆసియా నేషన్స్ కప్ చెస్
సాక్షి, హైదరాబాద్: ఆసియా నేషన్స్ కప్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మెరిసింది. ఇరాన్‌లోని తబ్రీజ్ నగరంలో ముగిసిన ఈ పోటీల్లో హారిక మొత్తం నాలుగు పతకాలు సాధించింది.
ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. క్లాసికల్ టీమ్ విభాగంలో హారిక, తానియా సచ్‌దేవ్, పద్మిని రౌత్, మేరీఆన్ గోమ్స్, ఇషా కరవాడేలతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. బోర్డు-1పై పోటీపడిన హారిక మూడున్నర పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. బ్లిట్జ్ ఈవెంట్‌లో హారిక నేతృత్వంలోని టీమిండియా స్వర్ణం కైవసం చేసుకుంది. ర్యాపిడ్ టీమ్ విభాగంలో భారత్ రజతం సాధించింది.