
గచ్చిబౌలి: ఇంట్లో చెప్పాపెట్టకుండా అక్కాతమ్ముడు అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ మసీదుబండలోని ప్రభుపాదకాలనీలో నివాసముండే అడ్డాల నరేష్ డ్రైవర్. 2022 ఫిబ్రవరి 10వ తేదీన తన మేనకోడలైన హారిక(20)ను వివాహం చేసుకున్నాడు.
ఇంట్లో హారికతో పాటు ఆమె తమ్ముడు ఫణీంద్ర(19) కూడా ఉంటున్నాడు. గత ఫిబ్రవరి 20వ తేదీన హారిక, ఫణీంద్ర ఇద్దరూ ఇంట్లో చెప్పకుండానే బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తమ కోసం వెతికితే చనిపోతామని హారిక లేఖ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయింది.
ఆమె భర్త నరేష్ కొంతకాలం వారి గురించి పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. హారిక తల్లిని సంప్రదిస్తే తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. కాగా ఐదు నెలల తర్వాత ఆలస్యంగా మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment