
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. జార్జియాలో మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో ద్రోణవల్లి హారిక, తానియా, ఇషా, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4–0తో వెనిజులాపై గెలిచింది.
హారిక 52 ఎత్తుల్లో సరాయ్‌పై, తానియా 44 ఎత్తుల్లో అమెలియాపై, ఇషా 49 ఎత్తుల్లో రవీరాపై, పద్మిని 42 ఎత్తుల్లో పటినో గార్సియాపై నెగ్గారు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్, ఆధిబన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఆస్ట్రియాను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment