టెపి సిజ్‌మన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను కూడా
మాల్మో (స్వీడన్): టెపి సిజ్‌మన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’గా ముగించింది. నిల్స్ గ్రాండెలియుస్ (స్వీడన్)తో గురువారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను నల్లపావులతో ఆడిన హారిక 51 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత హారిక ఒక పాయింట్ సాధించి మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.