విజేత హారిక | The winner was the winner of seven points in the women's section | Sakshi
Sakshi News home page

విజేత హారిక

Published Fri, Apr 28 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

విజేత హారిక

విజేత హారిక

హైదరాబాద్‌: రెక్జావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక అగ్రస్థానాన్ని సంపాదించింది. ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్‌ పట్టణంలో ముగిసిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో ఏడు పాయింట్లతో విజేతగా నిలిచింది. జాకబ్‌ ఫ్రెయుండ్‌ (జర్మనీ)తో జరిగిన చివరిదైన పదో రౌండ్‌ గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో విజయం సాధించింది.

ఓవరాల్‌గా ఈ టోర్నీలో హారిక ఆరు గేముల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీ అండర్‌–12 విభాగంలో భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద టైటిల్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement