
న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన మూడో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. నిల్స్ గ్రాండెలియుస్ (స్వీడన్)తో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.