భారత్‌కు 11వ సీడ్ చెస్ ఒలింపియాడ్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత ఓపెన్ జట్టుకు 11వ సీడింగ్ లభించింది. వచ్చే నెల 2 నుంచి 13 వరకు అజర్‌బైజాన్ రాజధాని బాకులో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఓపెన్ విభాగంలో భారత్ తరఫున పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, సేతురామన్, అధిబన్, కార్తికేయన్ మురళీ బరిలోకి దిగనున్నారు.
హరికృష్ణకిది ఎనిమిదో ఒలింపియాడ్ కావడం విశేషం. 14 ఏళ్ల ప్రాయంలో 2000లో తొలిసారి చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న హరికృష్ణ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌సలో 16వ స్థానంలో ఉన్నాడు. రెండేళ్ల క్రితం నార్వేలో జరిగిన ఒలింపియాడ్‌లో హరికృష్ణ పాల్గొనకపోరుునా భారత్ తొలిసారి కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, సౌమ్య, తానియా సచ్‌దేవ్, బొడ్డ ప్రత్యూష భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.