Perhaps
-
హరికృష్ణ తొలి గేమ్ డ్రా
షెన్జెన్(చైనా): భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ(14వ ర్యాంక్) షెన్జెన్ లాంగ్గాంగ్ చెస్ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్‌ను ‘డ్రా’తో ప్రారంభించాడు. రష్యన్ ఆటగాడు పీటర్ స్విద్లెర్ (20వ ర్యాంక్)తో జరిగిన తొలిగేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ ముందునుంచి దూకుడుగా ఆడా డు. చక్కని డిఫెన్స్‌తో స్విద్లెర్ హరికృష్ణను అడ్డుకోవడంతో 30 ఎత్తుల్లో గేమ్ ‘డ్రా’గా ముగిసింది. -
భారత జట్లకు మూడో గెలుపు
బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయాన్ని సాధించారుు. ఆదివారం జరిగిన మూడో రౌండ్లో భారత పురుషుల జట్టు 3-1తో అజర్బైజాన్ ‘బి’ జట్టుపై... మహిళల జట్టు 3.5-0.5తో ఫిలిప్పీన్‌స జట్టుపై గెలిచారుు. పురుషుల విభాగం గేముల్లో ఆధిబన్ 53 ఎత్తుల్లో అబసోవ్‌పై, విదిత్ సంతోష్ గుజరాతి 46 ఎత్తుల్లో ఉల్వీ బజరానిపై నెగ్గగా... దురార్బైలితో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 23 ఎత్తుల్లో; గుసినోవ్తో గేమ్‌ను సేతురామన్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగం గేముల్లో పద్మిని రౌత్ 42 ఎత్తుల్లో జోడిలిన్ ఫ్రోండాపై, తానియా సచ్దేవ్ 34 ఎత్తుల్లో క్రిస్టీ లామిల్పై, సౌమ్య స్వామినాథన్ 45 ఎత్తుల్లో కాథరీన్పై గెలుపొందగా... జానెల్లితో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
భారత్‌కు 11వ సీడ్ చెస్ ఒలింపియాడ్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత ఓపెన్ జట్టుకు 11వ సీడింగ్ లభించింది. వచ్చే నెల 2 నుంచి 13 వరకు అజర్బైజాన్ రాజధాని బాకులో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఓపెన్ విభాగంలో భారత్ తరఫున పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, సేతురామన్, అధిబన్, కార్తికేయన్ మురళీ బరిలోకి దిగనున్నారు. హరికృష్ణకిది ఎనిమిదో ఒలింపియాడ్ కావడం విశేషం. 14 ఏళ్ల ప్రాయంలో 2000లో తొలిసారి చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న హరికృష్ణ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌సలో 16వ స్థానంలో ఉన్నాడు. రెండేళ్ల క్రితం నార్వేలో జరిగిన ఒలింపియాడ్‌లో హరికృష్ణ పాల్గొనకపోరుునా భారత్ తొలిసారి కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, సౌమ్య, తానియా సచ్దేవ్, బొడ్డ ప్రత్యూష భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.