ప్రియుడిని పరిచయం చేసిన సింగర్‌ హారికా నారాయణ్‌.. త్వరలో పెళ్లి | Singer Harika Narayan Will Get Married Soon | Sakshi
Sakshi News home page

ప్రియుడిని పరిచయం చేసిన సింగర్‌ హారికా నారాయణ్‌.. త్వరలో పెళ్లి

Published Thu, Mar 7 2024 7:25 AM | Last Updated on Thu, Mar 7 2024 8:44 AM

Singer Harika Narayan Will Get Married - Sakshi

టాలీవుడ్‌ సింగర్‌ హారికా నారాయణ్‌ త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఆమె అధికారికంగా తెలిపారు. వరుస స్టేజ్‌ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో దూసుకెళ్తోన్న హారికా పలు పాటలతో లక్షలమందిని ఉత్సాహపరిచారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన హారిక అనుకుంటే హీరోయిన్‌గా కూడా రాణించవచ్చు.. ఎందుకంటే హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం.

తాజాగా హారికా నారాయణ్‌ తన స్నేహితుడు అయిన పృధ్వినాథ్ వెంపటితో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె తెలిపారు. వారిద్దరి మధ్య స్నేహంగా ఏర్పిడిన పరిచయం ఆపై ప్రేమగా మారిందని తెలిపిన ఆమె ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగినట్లు చెప్పారు. వారిద్దరు ఉంగారులు మార్చుకుంటున్న ఫోటోను హారికా షేర్‌ చేశారు. కానీ తనకు కాబోయే భర్త గురించి ఆమె ఎలాంటి వివరాలు షేర్‌ చేయలేదు.

తూర్పు గోదావారి జిల్లా రాజోలులో జన్మించిన హారిక.. తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆమె ఉత్తరాదిలో పెరిగారు. మెకానికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కాకపోతే, అనుకోని విధంగా గాయనిగా మారి నేడు తన గాత్రంతో అందర్నీ మెప్పిస్తుంది. ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటాంబానికి హారిక దగ్గరి బంధువు కావడం విశేషం. కర్ణాటక‌ సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమెకు మొదట నిహారిక కథానాయికగా నటించిన 'సూర్యకాంతం'తో  ప్లేబ్యాక్‌ సింగర్‌గా మారారు'.

ఆ తర్వాత  'నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్‌ రోజ్‌)' సాంగ్‌తో యూత్‌కు కనెక్ట్‌ అయ్యారు. విభిన్నమైన వాయిస్‌తో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక.. 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్‌ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్‌ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. హారికకు హీరో  మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చనే 'బ్రహ్మోత్సవం'లో నటించినట్లు గతంలో ఆమె తెలిపారు. తన అభిమాన హీరో సినిమా అయిన 'సర్కారువారి పాట'లో టైటిల్‌ ట్రాక్‌ పాడి దుమ్మురేపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement