బ్రహ్మ ఆనందం ట్రైలర్‌.. ప్రభాస్ చేతుల మీదుగా విడుదల | BrahmaAnandam Latest Movie Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

BrahmaAnandam Trailer: బ్రహ్మ ఆనందం ట్రైలర్‌.. ప్రభాస్ చేతుల మీదుగా విడుదల

Published Mon, Feb 10 2025 8:37 PM | Last Updated on Mon, Feb 10 2025 8:37 PM

BrahmaAnandam Latest Movie Official Trailer Out Now

టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ (Raja Goutham) నటించిన తాజా చిత్రం 'బ్రహ్మ అనందం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.  ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్‌ నిఖిల్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ప్రభాస్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement