
హారికకు రెండో గెలుపు
అనతొలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో ...
క్యాప్ డి అగ్డె (ఫ్రాన్‌స): అనతొలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో విజయాన్ని నమోదు చేసింది. సబ్రీనా వెగా గుటిరెజ్ (స్పెరుున్)తో మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 57 ఎత్తుల్లో గెలిచింది.
సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎనిమిదో రౌండ్‌లో హారిక 25 ఎత్తుల్లో ఎటెని బాక్రోట్ (ఫ్రాన్‌స) చేతిలో ఓడిపోరుుంది. తొమ్మిదో రౌండ్ తర్వాత హారిక నాలుగు పారుుంట్లతో ఐదో స్థానంలో ఉంది.