
చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మహిళలపై టీడీపీ నేతలు, వారి మద్దతుదారుల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం టీడీపీ నేత అనుచరుడు చిత్తూరు నగరంలో ఓ వివాహిత చీర లాగి అవమానించాడు. అడ్డు వచ్చిన ఆమె భర్తపై దాడికి దిగాడు. బాధితుల కథనం మేరకు.. బీజేపీ జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడుకు.. చిత్తూరు నగరంలోని మద్యం దుకాణాలు, బస్సులు నడుపుతున్న టీడీపీ నేత హరిప్రసాద్ నాయుడుకు మధ్య వ్యాపార లావాదేవీలపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతకు బీజేపీ నేత లీగల్ నోటీసులు పంపారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేత తన అనుచరుడు, పార్ట కార్యకర్త అయిన వెంకటకృష్ణమ నాయుడును రెచ్చగొట్టి ప్రభాకర నాయుడుపైకి పంపాడు.
శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆఫీసర్స్ లైన్‌లోని ప్రభారకర నాయుడి ఇంటికి వచ్చిన వెంకటకృష్ణమ నాయుడు అసభ్యంగా మాట్లాడడంతో పాటు ఆయన భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు. అడ్డొచ్చిన తన భర్తను చంపేస్తానని బెదిరించడంతోపాటు తమపై వెంకటకృష్ణమ నాయుడు దాడి చేశాడని హారిక తెలిపారు. దాడిలో మోకాలికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment