బిగ్‌ బాస్‌ : అభిజిత్‌ మైండ్‌ గేమ్‌.. భోరుమన్న హారిక | Bigg Boss 4 Telugu : Abhijeet Play Mind Game Harika Emotional | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ : అభిజిత్‌ మైండ్‌ గేమ్‌.. కంటతడి పెట్టిన హారిక

Published Wed, Oct 7 2020 11:07 PM | Last Updated on Thu, Oct 8 2020 4:14 AM

Bigg Boss 4 Telugu : Abhijeet Play Mind Game Harika Emotional - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో వినోదాత్మకంగా మొదలైన బీబీ హోటల్‌ టాస్క్‌ కాస్త సీరియస్‌గా మారింది. అతిథుల మెప్పు కోసం సిబ్బంది నానా కష్టాలు పడింది. ముఖ్యంగా అవినాష్‌ సీక్రెట్‌ టాస్క్‌తో హౌస్‌లో ప్రకంపనలు చెలరేగాయి. మోనాల్‌పై అఖిల్‌ సీరియస్‌ అయ్యాడు. అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ స్వీమ్మింగ్‌ టాస్క్‌ విజయవంతంగా పూర్తి చేశాడు. ముఖ్యంగా అభిజిత్‌ మైండ్‌ గేమ్‌, హారిక ఏడుపు, మెహబూబ్‌పై అవినాష్‌ ఫైర్‌ లాంటి సన్నివేశాలు నేటి ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారాయి. ఇంకా ఈ రోజు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఏమేం జరిగాయో డిటైల్డ్‌గా చూసేద్దాం..

పిన్ను పెట్టిన చిచ్చు
తనకు మటన్‌ బిర్యానీ కావాలని సోహైల్‌ ఆర్డర్‌ ఇవ్వగా.. హోటల్‌ సిబ్బంది కష్టపడి వండింది. అయితే దాంట్లో పొరపాటున చిన్న వెంట్రుక వచ్చింది. ఇంకేముంది సోహైల్‌ రెచ్చిపోయాడు. వెంటనే సిబ్బంది అంతా వచ్చి క్షమాపణలు చెప్పింది. ఇక సోహైల్‌ తీరును అమ్మ రాజశేఖర్‌ తప్పుపట్టాడు. కష్టపడి వండితే.. గుర్తింపులేదని అసహనానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా అవినాష్‌  సోహైల్‌కి పెట్టిన పుడ్‌లో హెయిర్‌పిన్ను ను పెట్టాడు. అయితే ఆ పిన్ను హోటల్‌ సిబ్బందే పెట్టిందని సోహైల్‌ ఫైర్‌ అయ్యాడు. అయితే సోహైలే పిన్ను పెట్టి తమను బ్లేమ్‌ చేస్తున్నాడని హోటల్‌ సిబ్బంది అనుమానించింది. దీంతో సోహైల్‌ ఒట్టుపెట్టుకొని మరీ నేను పెట్టలేదని చెప్పాడు. దీంతో అయోమయానికి గురైన సిబ్బంది... పొరపాటు పడి ఉండవచ్చని సోహైల్‌కి క్షమాపణలు చెప్పారు. 

అలకెందుకని అఖిల్‌ని నిలదీసిన మోనాల్‌
నామినేషన్‌ ప్రక్రియ రోజు జరిగిన గొడవతో తనకు దూరంగా ఉంటున్న అఖిల్‌ను కూల్‌ చేసే ప్రయత్నం చేసింది మోనాల్‌. రిసెప్షన్‌లో ఉండి ఫోన్ మాట్లాడుతూ అఖిల్‌ని చూసి మెలికలు తిరుగుతూ..ఎందుకు మాట్లాడటం లేదని అని అఖిల్‌ని ప్రశ్నించింది. అయినప్పటికీ అఖిల్‌ స్పందించకపోవడంతో పరుగున వచ్చి అఖిల్‌ని వెనుక నుంచి వాటేసుకుంది. దూరంగా ఉండటానికి గల కారణమేంటని అడగ్గా.. తాను ఎవరితో మాట్లాడతలేనని అఖిల్‌ చెప్పాడు. ఇక టిప్‌ కావాలంటే  తన బెడ్‌ను రెండు నిమిషాల్లో సర్ధాలని హారిక సూచించగా..నోయల్‌ ఆ పనిచేశాడు. దీంతో నోయల్‌కు 2500 టిప్పు దొరికింది.

సొమ్మసిల్ల పడ్డ రాజశేఖర్‌ మాస్టర్‌
ఇక రిచ్‌మేన్లుగా ఉన్న మెహబూబ్‌, సోహైల్‌ అయితే హోటల్‌ సిబ్బందికి చుక్కలు చూపించారు. హోటల్ టీంలో ఉన్న రాజశేఖర్ మాస్టర్‌కు 100 సార్లు స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాలని టాస్క్‌ ఇచ్చారు. ఆయాసం వచ్చినప్పటికీ మాస్టర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో దూకుతూ లేస్తూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. టాస్క్‌ని విజయవంతంగా కంప్లీట్‌ చేసిన మాస్టర్‌.. స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు వచ్చి కిందపడిపోయాడు. రాజశేఖర్‌ మాస్టర్‌ హార్డ్‌వర్క్‌ చూసి 3000 రూపాయల టిప్‌ ఇచ్చాడు మెహబూబ్‌. 

ఇక అఖిల్‌కి 150 పుష్అప్‌లు  చేయాలని టాస్క్ ఇచ్చారు గెస్ట్‌లు.. అయితే అఖిల్ అతి కష్టం మీద 75 మాత్రమే తీయగలిగాడు. ఆ తరువాత అభిజిత్‌తో 20 కేజీలు ఎత్తించి 59 పుష్ అప్‌లు తీయించారు. ఈ క్రమంలో అభిజిత్‌ కూడా కిందపడిపోయాడు. అయితే అభిజిత్ కష్టపడుతుంటే సుజాత తెగ ఫీల్ అయిపోయింది.. ఏడుస్తూ వీళ్లను చూస్తుంటే భయంగా ఉంది అంటూ బాధపడింది. లాస్య ఆమెను ఓదార్చింది. అభి.. టాస్క్‌ను కంప్లీట్‌ చేయనప్పటికీ.. సోహైల్‌ 1000 రూపాయల టిప్పు ఇచ్చాడు. 

ఒక్క మాట తేడా వచ్చినా.. పుచ్చెలు ఎగిరిపోతాయి : మెహబూబ్‌
తనకు సర్వీస్‌ సరిగా అందించడంలేదని పదే పదే చెప్పడంతో మెహబూబ్‌పై హోటల్‌ సిబ్బంది అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మెహబూబ్‌ సీరియస్‌ అయ్యాడు. ఒక్క మాట తేడా వచ్చినా... పుచ్చు పగిలిపోతుంది అంటూ హోటల్‌ సిబ్బందికి వార్నింగ్‌ ఇచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైనా అఖిల్‌.. మెహబూబ్‌పై విరుచుకుపడ్డాడు. 

 రౌడీయిజం ఊర్లో చేస్కో.. అవినాష్‌
 మెహబూబ్‌ అలాగే రెచ్చిపోతుండటంతో అవినాష్ రంగంలోకి.. రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో.. ఇది బిగ్‌ బాస్‌ హౌస్‌.. ఇక్కడ చేసుకుంటే వేరేలా ఉంటుందంటూ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. మధ్యలో ఇంటి సభ్యులు వచ్చి సముదాయించడంతో అక్కడితో గొడవ ఆగింది. తర్వాత మెహబూబ్‌ ఒక్కరికి సారీ చెబుతూ వచ్చాడు. ఇక అవినాష్‌కు సారీ చెప్పడమే కాకుండా.. సర్వీస్‌ నచ్చిందంటూ టిప్పు కూడా ఇచ్చాడు. ఇక గంగవ్వ తనకు సర్వీస్ బాగా చేసిన వాళ్లకి వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే.. మెహబూబ్ సీరియస్ అయ్యాడు. అలా డబ్బులు ఇవ్వొద్దు అవ్వా.. నీ దగ్గర ఇంకా ఎంత ఉన్నాయ్.. ఆ మిగిలిన డబ్బులు నాకు ఇచ్చెయ్ అని తీసేసుకున్నాడు. అయితే గంగవ్వ ఇచ్చినట్టే ఇచ్చి నాకు ఎవరితోనూ పనిలేదు. రూపాయి కూడా ఇవ్వను అంటూ తిరిగి తీసేసుకుంది.

హారిక- అభిజిత్ చిలిపి ముచ్చట్లు
అభిజిత్-హారికలు వేరు వేరు టీంలలో ఉన్నందుకు తెగ ఫీలైపోయారు.నాకు ఏ సర్వీస్ కావాలన్నా నీ ద్వారా చేపించుకోవచ్చు.. అంటూ అభి కళ్లలోకి కళ్లు పెట్టు చూసిన హారిక.. బిగ్ బాస్ మా ఇద్దర్నీ ఇలా ఆపోజిట్ టీంలో ఎందుకు వేశావ్ చెప్పు.. దొంగ అంటూ తెగ సిగ్గు పడిపోయింది. ఆ తరవాత అభి సేవల్ని ఉపయోగించుకుంటూ అతనితో మసాజ్ చేయించుకుంది.

టిప్‌ కోసం అభి.. అమ్మల లొల్లి
అతిథులు ఇచ్చే టిప్‌ విషయంలో అభిజిత్‌, రాజశేఖర్‌ మాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. వచ్చిన దాంట్లో సగం టిప్‌ తనకు ఇవ్వాలని మాస్టర్‌ను అభి అడగ్గా.. ఇవ్వనని రాజశేఖర్‌ మాస్టర్‌ ముఖం మీదే చెప్పే చేశాడు.దీంతో అభిజిత్‌ మరోసారి మైండ్‌ గేమ్‌ ఆడుతూ.. నేను మేనేజర్‌ని..సర్వీస్ చేయడం మానేయమని చెప్తుంటే నువ్వు ఎందుకు వినవు.. అంటూ అభి మాస్టర్‌పై ఫైర్‌ కాగా, నువ్ చెప్తే నేను వినాలా? నేను వాళ్లకి చేసి పెడతా అంటూ గెస్ట్‌లకు పుడ్‌ ఇచ్చి టిప్‌ సంపాదించాడు రాజశేఖర్‌

ఇక మోనాల్‌తో మసాజ్ చేయించుకుని గోర్లు కట్ చేయించుకున్నాడు సొహైల్. అతనికి మసాజ్ చేస్తూ పాట కూడా పాడిన మోనాల్.. ఆ తరువాత అభిజిత్‌తో  మాట్లాడుతూ.. దివి కోసం మాస్టర్ ఆడుతున్నాడని.. ఆమెను కెప్టెన్ చేయడానికి మాస్టర్ చాలా కష్టపడుతున్నాడని చెప్పింది. నిజమే అన్నట్లు తల ఊపిన అభి.. కెప్టెన్సీ టాస్క్‌లో నాకు హెల్ఫ్‌ చేస్తానని మాట తప్పారని మాస్టర్‌పై అసంతృప్తిని వెల్లగక్కాడు.

అఖిల్‌ మైండ్‌ గేమ్‌.. హారిక కంటతడి
ఇక హోటల్‌ సిబ్బంది సర్వీస్‌కు మెచ్చి హారిక ఒక స్టార్‌ ఇవ్వడానికి ముందుకు రాగా, అది ఆమె వ్యక్తిగతం అని మెహబూబ్‌ చెప్పాడు. అయితే అప్పటికే 5 స్టార్లను దొంగిలించిన అఖిల్‌.. హారికకు ఈ విషయం చెప్పాడు. అయితే తన స్టార్‌ తనకు ఇస్తే తిరిగి ఇస్తానని హారిక చెప్పగా.. అభిజిత్‌ తెలివిగా 5 స్టార్లను తన చేతిలో పెట్టి..తిరిగి తీసుకున్నాడు. దీంతో 5 స్టార్లు అతిథులు ఇచ్చినట్లే అని అభి చెప్పగా.. లేదు లేదు నేను ఒక్కటే స్టార్‌ ఇచ్చానని హారిక చెప్పింది. అయినప్పటికీ గేమ్‌ ప్రకారం 5 స్టార్లు నువ్వే నా చేతికి ఇచ్చావని చెప్పడంతో బిత్తిరి ముఖం వేసింది. పదే పదే బిగ్‌బాస్ కెమెరా ముందుకు వచ్చి నేను ఒకటే స్టార్ ఇచ్చాను. ఐదు స్టార్స్ ఇవ్వలేదని కంటతడి పెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement