హారిక ఖాతాలో ఎనిమిదో డ్రా
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఖాతాలో మరో ‘డ్రా’ చేరింది. వాలెంటీనా గునీనా (రష్యా)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను హారిక 73 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఈ టోర్నీలో హారికకిది వరుసగా ఆరో ‘డ్రా’కాగా... ఓవరాల్‌గా ఎనిమిదోది.
పదో రౌండ్ తర్వాత హారిక ఐదు పారుుంట్లతో ఏడో స్థానంలో ఉంది. గురువారం జరిగే చివరిదైన 11వ రౌండ్‌లో అల్మీరా స్క్రిప్‌చెంకో (ఫ్రాన్‌స)తో హారిక ఆడుతుంది. 12 మంది క్రీడాకారిణుల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం చైనా ప్లేయర్ జూ వెన్‌జున్ 7 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది.