ప్రతి ఇంట్లో తనలాంటి అమ్మాయి ఉండాలి అనుకునేలా చేస్తానంది గీతూ రాయల్. మరి నిజంగానే గీతూ అందరికీ రోల్ మోడల్‌గా నిలబడేట్లుగా ప్రవర్తిస్తుందా? అంటే ఆమెకు గుండె ధైర్యం, ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునే స్థైర్యం, వాక్చాతుర్యం, ఎవరేమన్నా డోంట్ కేర్ అంటూ లెక్కచేయని తత్వం ఉన్నాయి. కానీ అదే సమయంలో ఎదుటివారిని చులకన చేస్తూ మాట్లాడే స్వభావం, పక్కవాళ్లను (ఆఖరికి బిగ్‌బాస్‌ను సైతం) కాస్తైనా పట్టించుకోని తెంపరి తనం, హద్దులు మీరే అల్లరి.. ఇలా చాలానే ఉన్నాయి. అంతదాకా ఎందుకు? గీతూ ప్రవర్తనకు నిదర్శనంగా పై ఒక్క ఫొటో చాలు..
బిగ్‌బాస్ ఇంట్లో ఎవరితోనూ రిలేషన్స్ పెట్టుకోను, వాళ్లతో కలిసి ఉన్నంత మాత్రాన సంబంధాలు కలుపుకోను అని మొదట్లో బల్ల గుద్ది చెప్పింది గీతూ. కానీ సీజన్ సగానికి వచ్చేసరికి బాలాదిత్య, ఆదిరెడ్డిలతో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పెట్టుకుంది. వసంతి నామినేట్ చేసినప్పుడు కూడా నాకు క్లోజ్‌గా ఉన్న నువ్వు నామినేషన్ చేస్తే తీసుకోలేకపోయానంది. ఇలా తనకెవరూ వద్దంటూనే అందరితో బాగా కలిసిపోయింది. ఇదిలా ఉంటే ఎటూ ఆదిరెడ్డి.. గీతక్క.. గీతక్క.. అంటూ వెనకాలే తిరుగుతుండటంతో అతడిపై తన పైత్యం చూపించింది గీతూ.
సోఫాలో పడుకుని తన కాళ్లు ఆదిరెడ్డి ముఖం వైపు చాపింది. అంతేనా? ఆది ముఖం మీదే కాళ్లు ఊపుతూ మాట్లాడింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మనిషి ముఖం మీద కాళ్లు ఊపడం సంస్కారమా? అని ఫైర్ అవుతున్నారు. తను ఏం చేసినా అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతోనే గీతూ తలపొగరు రోజురోజుకూ పెరిగిపోతుంది అని మండిపడుతున్నారు. అమ్మాయిలకు ఆదర్శంగా ఉంటానన్నావు, అవునవున్లే, నిన్ను చూసి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. ముఖం మీద కాలు పెట్టొద్దన్న కామన్‌సెన్స్ కూడా లేదు, మళ్లీ అందరికీ నీతులు చెప్తుంది, వరస్ట్ బిహేవియర్ అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా గీతూ అతి చేష్టలు తగ్గించుకోకపోతే ఆమెకు మొదటికే మోసం వస్తుంది!
Intlo ala alavatu ayyundochu...
— Vamc Krishna (@lyf_a_zindagi) October 18, 2022
But thats a very bad habit..
Moham meedha kalu petta koodadhu anedhi just common sense...she need to change thay habit... atleast when she said when I want to inspire girls or everyone #GeetuRoyal #BiggBossTelugu6 pic.twitter.com/KSi0rdIVr6
చదవండి: టాస్క్‌లో బోరింగ్ ఫర్ఫామెన్స్, బిగ్‌బాస్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment