Bigg Boss 6 Telugu Episode 61 Highlights:Sri Satya New Captain Of BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఆదిరెడ్డిని బురిడీ కొట్టించిన గీతక్క.. కెప్టెన్‌ ఎవరంటే?

Published Thu, Nov 3 2022 11:32 PM | Last Updated on Fri, Nov 4 2022 9:29 AM

Bigg Boss 6 Telugu: Sri Satya New Captain Of BB House - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 61: బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం మిషన్‌ పాజిబుల్‌ అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ జరుగుతోంది. సీక్రెట్‌ మిషన్‌ టాస్క్‌లో భాగంగా రెడ్‌ టీమ్‌ కావాలనే బాత్రూమ్‌ను డర్చీగా మార్చింది. కానీ ఆ నిందను బ్లూ టీమ్‌ మేద వేయడంతో హౌస్‌లో రచ్చ రంబోలా జరిగింది. సీక్రెట్‌ గేమ్‌ సక్సెస్‌ కావడంతో బ్లూ టీమ్‌లో చనిపోయిన రోహిత్‌ను తిరిగి బతికించారు.

మధ్యాహ్నం భోజనం సమయానికి సూర్య ప్లేటు కోసం ఇల్లంతా వెతికింది ఇనయ. ఎక్కడా కనిపించకపోవడంతో ప్లేటు మీద సూర్య పేరును ఎవరు చెరిపేశారు? అని నిలదీసింది. దీనికి బాలాదిత్య నువ్వు వాడుతున్నావనే చెరిపేశారని ఆన్సరిచ్చాడు. అది విన్న రేవంత్‌.. అలా అనడం తప్పంటూ అందుకున్నాడు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, సత్య ఏం అందో అదే చెప్పానని బదులిచ్చాడు. నా ఎమోషన్‌తో ఆడుకుంటున్నారని ఫైర్‌ అయిన ఇనయ అన్నం తిననంటూ ఓ మూలన కూర్చుని ఏడ్చింది. ఇది చూసిన శ్రీసత్య.. అంత ప్రేముంటే బిగ్‌బాస్‌ను అడిగి మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో వెళ్లిపోయి సూర్య ఇంట్లో కూర్చోమను అని వెక్కిరించింది. ఇనయ అలిగి ఏడుస్తూ కూర్చోవడంతో కీర్తి ఓదార్చగా మెరీనా గోరు ముద్దలు తినిపించింది.

తర్వాత గేమ్‌ తిరిగి ప్రారంభం కాగా రెడ్‌ స్క్వాడ్‌లో రేవంత్‌ కంటికి గాయం అయింది. ఇంతలో గీతూ అవుట్‌ అయింది. అనంతరం బిగ్‌బాస్‌ ఇచ్చిన రెండో మిషన్‌లో రెడ్‌ టీమ్‌ గెలవడంతో వారు రోహిత్‌ను తిరిగి చంపేశారు. ఇక ఈ రోజుకు టాస్క్‌ సమయం ముగిసిందన్నాడు బిగ్‌బాస్‌. అయితే రాత్రి టీ షర్ట్‌లు దొంగిలిద్దామని ప్లాన్‌ వేసింది గీతూ. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్‌ ఆన్‌ అయ్యాకే తిరిగి గేమ్‌ స్టార్ట్‌ చేద్దామని మాయమాటలు చెప్పింది. అతడూ సరేనని నమ్మాడు. అలా అతడిని బురిడీ కొట్టించి అర్ధరాత్రి ఆది రెడ్డి టీషర్ట్‌ దొంగిలించింది గీతూ.

తెల్లవారుజామున ఆదిరెడ్డికి గీతూ గేమ్‌ అర్థమైంది. గేమ్‌ పాజ్‌లో ఉన్నప్పుడు టీషర్ట్స్‌ స్ట్రాప్స్‌ తీసేయడం తప్పని వారించగా తానసలు తీయలేదని అబద్ధమాడింది గీతూ. గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్‌ ఆదిరెడ్డి గేమ్‌ స్టార్ట్‌ అవుతుందని హెచ్చరించాడతడు. అయితే ఈ మిషన్‌ పాజిబుల్‌ గేమ్‌ డ్రా అయిందట. దీంతో రెండు టీమ్స్‌లోని మెరీనా, వాసంతి, ఇనయ, ఫైమా, సత్య, గీతూ కెప్టెన్సీ కోసం పోటీపడగా సత్య కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది.

చదవండి: బుజ్జమ్మ తన గర్ల్‌ఫ్రెండే కాదన్న సూర్య, ఇనయ లైన్‌ క్లియర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement