Bigg Boss 6 Telugu Today Episode Promo: Adi Reddy Fires On Geetu Royal - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: నిన్ను ఏడిపిస్తా, అదే నేను కొట్టే దెబ్బ.. ఆదిరెడ్డి వార్నింగ్‌

Published Fri, Nov 4 2022 4:36 PM | Last Updated on Fri, Nov 4 2022 6:18 PM

Bigg Boss 6 Telugu: Adi Reddy Fires On Geetu Royal - Sakshi

ఆది ఆవేశం ఆపుకోలేక తన టీషర్ట్‌ తీసేసి మైక్‌ విసిరికొట్టాడు. నువ్వు పర్సనల్‌గా ఆడావు అని ఫైర్‌ అయ్యాడు. నిన్ను ఏడిపించే రోజు దగ్గరలోనే ఉందని మాటిస్తున్నా, అదే నేను కొట్టే దెబ్బ అని రగిలిపోయాడు

బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో శ్రీహాన్‌, ఇనయ గొడవ ఎంతో ఫేమస్‌. నామినేషన్స్‌ వస్తున్నాయంటే చాలు వీరి పోట్లాట చూద్దామని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్‌. ఆ రేంజ్‌లో ఉంటాయి వీరి గొడవలు. అయితే గీతూ, ఆదిరెడ్డి గొడవ పెట్టుకుంటే చూడాలని వెయిట్‌ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇన్నాళ్లకు వారి ముచ్చట తీరబోతోంది. ఈ రోజు గేమ్‌లో ఆది గీతూతో పోట్లాటకు దిగాడు. ఆటలో నమ్మించి గొంతు కోసిందని ఫ్రస్టేట్‌ అయ్యాడు ఆది.

తన టీషర్ట్‌ స్ట్రిప్స్‌ దొంగతనం చేయనని మాటిచ్చి తీరా అదే పని చేసి ఆదికి ఝలక్‌ ఇచ్చింది గీతూ. ఇది తెలిసిన ఆది ఆవేశం ఆపుకోలేక తన టీషర్ట్‌ తీసేసి మైక్‌ విసిరికొట్టాడు. నువ్వు పర్సనల్‌గా ఆడావు అని ఫైర్‌ అయ్యాడు. నిన్ను ఏడిపించే రోజు దగ్గరలోనే ఉందని మాటిస్తున్నా, అదే నేను కొట్టే దెబ్బ అని రగిలిపోయాడు ఆదిరెడ్డి. కాగా గీతూ తనకు దగ్గరైన అందరినీ దూరం చేసుకుంటూ వస్తోంది. మొదట రాజ్‌తో మంచిగా ఉండి అతడితో కయ్యానికి దిగి దూరమైంది. తర్వాత బాలాదిత్యతో కావాలని గొడవలు పెట్టుకుంది. ఇప్పుడు ఉన్న ఒక్క ఫ్రెండ్‌ ఆదిరెడ్డని నమ్మించి మోసం చేసి అతడి కోపానికి కారణమైంది. మరోపక్క ఇనయ.. తనను కావాలని కొడుతున్నారని ఆరోపించింది. దీనికి శ్రీహాన్‌.. ఇంటెన్షన్‌ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అని ఎగతాళి చేశాడు. ఇకపోతే ఆల్‌రెడీ శ్రీసత్య కెప్టెన్‌ అయినట్లు తెలుస్తోంది.

చదవండి: ఫ్లైట్‌ నుంచి దూకేశా: శర్వానంద్‌
ముంబై హీరోయిన్స్‌పై అడివి శేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement