
బిగ్‌బాస్ ఇచ్చే గేమ్‌లో ఏవైనా లొసుగులు ఉన్నాయా? అని చూసే మొట్టమొదటి వ్యక్తి గీతూ. ఫిజికల్‌గా గేమ్ ఆడలేని ఆమె బుద్ధి బలంతో గేమ్‌ను రఫ్ఫాడించాలనుకుంటుంది. ఈ క్రమంలో అతి తెలివి ప్రదర్శించి నాగార్జునతో గతవారం చీవాట్లు కూడా తింది. ఇకపోతే నిన్నటివరకు బాలాదిత్య వీక్‌నెస్ మీద దెబ్బ కొట్టిన గీతూ ఈరోజు ఆదిరెడ్డితో గొడవ పెట్టుకునేట్లు కనిపిస్తోంది.
బాత్రూమ్ ఏరియాలో ఆది టీషర్ట్ దాచుకుంటే వెళ్లి దాన్ని దొంగిలించింది గీతూ. పోనీ తను గేమ్‌లో ఉందా? అంటే లేదు. ఆల్‌రెడీ బ్లూ టీమ్ తనను అవుట్ చేసింది. అయినా సరే, ఆది టీషర్ట్ దొంగిలించి దాచేసింది. ఎవరు తీశారని అడిగితే తాను తీయలేదని చెప్పింది. కానీ ఆది మాత్రం ఆమె మీదే డౌట్ పడ్డాడు. ఒకవేళ గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడు ఆది.
చదవండి: బుజ్జమ్మ సూర్య గర్ల్‌ఫ్రెండే కాదట, అంటే ఇనయ లైన్ క్లియర్ అయినట్లేనా?
అంత ప్రేముంటే ఇప్పుడే సూర్య ఇంటికి వెళ్లిపోమను: శ్రీసత్య
Comments
Please login to add a commentAdd a comment