
బిగ్‌బాస్ హౌస్‌లో బాలాదిత్య ఎలిమినేషన్‌ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మంచి మనిషిని బిగ్‌బాస్ హౌస్‌లో ఇక మీదట చూడబోమని సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఆయన మాత్రం గెలుపైనా, ఓటమైనా సమానంగా స్వీకరిస్తానన్నట్లుగా చిరు దరహాసంతో వీడ్కోలు పలికారు.
ఇకపోతే ఈరోజు మరొకరిని ఎలిమినేట్ చేయనున్నాడు నాగ్. అంతకన్నా ముందు ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తో గేమ్ ఆడించనున్నాడు. కంటెస్టెంట్ ఒకరు బొమ్మ గీస్తే వారి టీమ్ మేట్స్ అది ఏ సినిమానో గుర్తుపట్టాలి. సినిమా విషయం పక్కనపెడితే వారు గీసింది ఏ బొమ్మో అర్థం కాకుండా ఉంది. ఇక ఆడపిల్లలు వస్తే బాగా డ్యాన్స్ చేస్తున్నావని ఆదిరెడ్డిని ఆటపట్టించాడు నాగ్. మొత్తానికి తనకు రాని డ్యాన్స్ కూడా బాగా నేర్చుకున్నాడు ఆది. చివర్లో అందరూ జై బాలయ్య స్టెప్పు వేసి అదుర్స్ అనిపించారు.
చదవండి: చివరి నిమిషంలో ట్విస్ట్, బాలాదిత్యతో పాటు వాసంతి అవుట్
శ్రీహాన్ టాప్ 5లో డౌటే, ఇనయ లేకపోతే బిగ్‌బాసే లేదు: గీతూ
Comments
Please login to add a commentAdd a comment