Bigg Boss 6 Telugu Today Promo: Geetu Royal Breaks Rules As Sanchalak In Fish Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నీచమైన ఆట, గీతూను అసహ్యించుకుంటున్న నెటిజన్లు

Published Wed, Oct 26 2022 3:52 PM | Last Updated on Wed, Oct 26 2022 5:37 PM

Bigg Boss Telugu 6: Geetu Royal Breaks Rules as Sanchalak - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ చేపల మార్కెట్‌గా మారిపోయింది. పై నుంచి చేపల వర్షం పడుతుంటే వాటిని పట్టుకునేందుకు పోటీపడుతున్నారు హౌస్‌మేట్స్‌. చేపల చెరువు అనే కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో ఇప్పటికే గీతూ- ఆదిరెడ్డి జంట ఔట్‌ అయింది. దీంతో బిగ్‌బాస్‌ నెక్స్ట్‌ లెవల్‌ కోసం ఆ జంటను సంచాలకులుగా నిర్ణయించాడు. ఇదే సరైన అవకాశం అనుకున్న గీతూ ఆటను తనకు నచ్చినట్లు మార్చేస్తోంది.

చేపలు దాచుకునే బుట్టను ఎవరూ కవర్‌ చేయకూడదని కొత్త రూల్‌ తీసుకొచ్చింది. అలాగే మిగతా హౌస్‌మేట్స్‌తో పాటు తను కూడా చేపలు పట్టుకునేందుకు వెళ్లింది. మెరీనాను టార్గెట్‌ చేసి ఆమె దగ్గరున్న చేపలను లాక్కుని విసిరేసింది. ఇవన్నీ చూసి సహసంచాలకుడైన ఆదిరెడ్డికి తిక్క లేచింది. నువ్వు చేస్తోంది తప్పని ఆమెను విమర్శించాడు. దీనికి గీతూ.. నువ్వు అతి చేయకు ఆదిరెడ్డి, నా గేమ్‌ మధ్యలో ఎందుకు వస్తున్నావు? అని ప్రశ్నించింది. ఇన్ని రోజులలో ఏ సంచాలకుడైనా గేమ్‌ ఆడటం చూశావా? అని ఆది నిలదీయగా తాను గేమ్‌ ఆడట్లేదని, ఆడిస్తున్నానని ఆన్సరిచ్చింది గీతూ.

ఇక గీతూ అతి తెలివి ప్రదర్శించడంపై హౌస్‌మేట్స్‌ మండిపడ్డారు. బ్యాట్స్‌మెన్‌ షాట్‌ కొట్టాక అంపైర్‌ క్యాచ్‌ పట్టడంలా ఉంది అని బాలాదిత్య సెటైర్‌ వేయగా అవును, అసలది కరెక్ట్‌ కాదని అసహనం ప్రదర్శించాడు ఆదిరెడ్డి. అయినా సరే అడ్డదిడ్డంగా వాదిస్తూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ప్రవర్తిస్తూ రెచ్చిపోతోంది గీతూ. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు గీతూను దుమ్మెత్తిపోస్తున్నారు. ఓటమిని సహంచలేక ఆమె ఇలా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తోందని విమర్శిస్తున్నారు. ఇంత దరిద్రమైన గేమ్‌ ఆడే కంటెస్టెంట్‌ను ఎన్నడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌లో చేపల లొల్లి, వెక్కివెక్కి ఏడ్చిన గీతూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement