
మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా మాటలో, ఆటలో దూసుకుపోయే ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను భయంతో గజగజ వణికిపోయేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. నిన్న దెయ్యం అరుపులతో హౌస్‌మేట్స్‌ను హడలెత్తించిన బిగ్‌బాస్ నేడు వారందరికీ ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. చీకటి గదిలోకి వెళ్లి క్యాండిల్‌ను కనుక్కోవాలని ఆదిరెడ్డికి ఓ పని అప్పజెప్పాడు. కానీ ఆది అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే కదా.. భయంతో ఉన్నచోటనే ఉండిపోయాడు.
అతడు భయపడటంతో మీకు తోడు కోసం ఎవరినైనా పంపించాలా? అని బిగ్‌బాస్ అడిగాడు. ఇందుకతడు శ్రీహాన్ పేరు చెప్పడంతో అతడిని చీకటి గదిలోకి రమ్మన్నాడు బిగ్‌బాస్. శ్రీహాన్ వచ్చి ధైర్యం చెప్తాడనుకుంటే అరుపులు, కేకలతో ఆదిరెడ్డిని మరింత భయపెట్టాడు. మరి ఇంతకీ వాళ్లిద్దరూ ఆ ఛాలెంజ్ గెలిచారా? లేదా? చూడాలి.
చదవండి: కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment