
టికెట్ టు ఫినాలే.. ఈ ఒక్క టాస్క్ గెలిస్తే చాలు నేరుగా ఫినాలేలో అడుగు పెట్టొచ్చు. అందుకే ఎలాగైనా ఈ బంపర్ ఆఫర్ అందుకుని తీరాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్‌మేట్స్. అయితే ఈ పోటీలో నెక్స్ట్ ఛాలెంజ్ కోసం పోటీపడే నలుగురు సభ్యులు ఎవరనేది ఇంటిసభ్యులే ఏకాభిప్రాయంతో నిర్ణయించాలన్నాడు బిగ్‌బాస్. ఇది విని హౌస్‌మేట్స్ డీలా పడిపోయారు. ఏకాభిప్రాయంలో తమని తీసేస్తే అప్పటిదాకా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన చెందారు.
అయినా టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం ఆప్షన్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేశాడు ఆదిరెడ్డి. ఆడి ఓడిపోయినా పర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల ఆడకుండానే ఆట నుంచి తప్పుకుంటే అది భరించలేమన్నాడు రోహిత్. ఒకవేళ టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం వల్ల నన్ను తీసేస్తే ఒక్కడిని కూడా గెలవనివ్వని వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. మరి కంటెస్టెంట్లు తిరగబడటంతో బిగ్‌బాస్ వెనక్కు తగ్గాడా? లేదంటే హౌస్‌మేట్సే అడ్జస్ట్ అయి ఆటలో ముందుకు సాగారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సోషల్ మీడియా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి టికెట్ టు పినాలే టాస్క్ గెలిచి టాప్ 5లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
చదవండి: టికెట్ టు ఫినాలే కోసం పోటాపోటీగా ఫైట్ చేసిన లేడీ టైగర్స్
Comments
Please login to add a commentAdd a comment