ఆది రెడ్డి జీరో, ఎలిమినేట్‌ అయిపోతావ్‌!: గీతూ | Bigg Boss 6 Telugu: Bigg Boss Gives Task For Food | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఆదిరెడ్డి కాకుండా వాళ్లు ఎలిమినేట్‌ అవుతే ఫీలవుతా: గీతూ

Published Thu, Oct 20 2022 12:20 AM | Last Updated on Sat, Oct 22 2022 3:55 PM

Bigg Boss 6 Telugu: Bigg Boss Gives Task For Food - Sakshi

Bigg Boss Telugu 6, Episode 46: బిగ్‌బాస్‌ హౌస్‌లో సెలబ్రిటీ గేమింగ్‌ లీగ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విషయం తెలిసిందే కదా! ఈ లీగ్‌లో రేవంత్‌, ఫైమా, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్‌, కీర్తి, ఇనయ, శ్రీహాన్‌.. టాలీవుడ్‌ ఫాంటసిస్‌ టీమ్‌ కాగా సూర్య, రోహిత్‌, అర్జున్‌, రాజ్‌, శ్రీసత్య, గీతూ, మెరీనా, వాసంతి టాలీవుడ్‌ డైనమిక్‌ టీమ్‌లో ఉన్నారు. ఈ రెండు టీమ్స్‌లో అతి కొద్ది మంది మాత్రమే పర్ఫామ్‌ చేయగా మిగతా ఎవరూ అసలు టాస్క్‌ను సరిగా పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యాడు బిగ్‌బాస్‌. ఆ కోపాన్ని నేటి ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఇంటిసభ్యులతో మాట్లాడటం మానేశాడు. ఏది చెప్పాలనుకున్నా లెటర్స్‌ ద్వారానే తెలియజేశాడు. మరి ఆ వివరాలేంటో నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ రద్దవడంతో కెప్టెన్‌గా తాను ఫెయిలయ్యానంటూ కెమెరాల ముందు ఏడ్చేశాడు సూర్య. మరోపక్క ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఈ సీజన్‌కు వచ్చినవాళ్లలో ఎక్కువమంది తుప్పాస్‌ కంటెస్టెంట్స్‌ అని గీతూతో చెప్పుకొచ్చాడు. ఆమెనేమో.. నువ్వు నిన్నటి టాస్క్‌లో సరిగ్గా పర్ఫామ్‌ చేయలేదు, బిగ్‌బాస్‌ను కాదు నన్ను నిరాశపర్చావు అంటూ పెద్ద క్లాస్‌ పీకింది. ఇలాగైతే ఫేమ్‌ ఉన్నవాళ్లు ఉండి లేనివాళ్లు వెళ్లిపోతారని జోస్యం పలికింది.

'నువ్వు ఎక్కడ పోతావోనని నాకు భయమేస్తోంది ఆది రెడ్డి.  నువ్వు కూడా ఎలిమినేట్‌ అయ్యేవాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు. కానీ నా వల్ల సేఫ్‌ అవుతావు. అది పక్కన పెట్టేస్తే నీ వల్ల ఎంటర్‌టైన్‌ చేసేవాళ్లు వెళ్లిపోయినా బాధపడతా. నీ దగ్గర ఎంటర్‌టైన్‌మెంట్‌ జీరో' అని అతడిని తక్కువ చేస్తూ మాట్లాడింది. ఆమె మాటలు చూస్తుంటే బాధపడతానంటూనే ఆదిరెడ్డి వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు ఉంది. ఇంతలో అక్కడికి బాలాదిత్య రావడంతో.. నువ్వు మోస్ట్‌ ఇమ్మేచ్యూర్‌ పర్సన్‌వి అంటూ అతడిని కూడా తిట్టేసింది. అయినా సరే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు.

టాస్క్‌ బాగా ఆడనివాళ్లలో ఇనయ పేరు కూడా ఉంది. దీంతో తన ఫ్రెండ్సే సరిగా పట్టించుకోవడం లేదని ఫీలైంది ఇనయ. ఆ బాధ పరోక్షంగా శ్రీహాన్‌తో మాట్లాడటానికి కారణమైంది. నన్ను నామినేట్‌ చేశావనే కోపంతో నిన్ను నామినేట్‌ చేశానంతే తప్ప నీమీద ఎలాంటి కోపం లేదు, చాలామంది కంటే నువ్వు బెటర్‌ అని శ్రీహాన్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది ఇనయ. ఆమె అలా పొగడటంతో సంతోషపడిపోయాడు శ్రీహాన్‌. మరోపక్క ఇనయను కావాలనే దూరం పెడుతున్నానని సూర్య కెమెరాలతో చెప్పాడు.

తర్వాత బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను బెడ్‌రూమ్‌లో ఉండాలని ఆదేశించాడు. వాళ్లందరూ బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు లాక్‌ చేసేసి ఇంట్లోకి దొంగలను పంపించి ఫుడ్‌ అంతా వెనక్కు తీసుకెళ్లాడు. అంతేకాదు, ఇప్పటినుంచి ఏది కావాలన్నా పోరాడి సంపాదించుకోవాలని చెప్పాడు. మరోవైపు ఆకలి బాధతో సూర్య, గీతూ స్పూన్‌ చక్కెర దొరుకుతే దాన్ని సీక్రెట్‌గా ఆరగించారు. ఆకలితో అలమటిస్తున్న ఇంటిసభ్యులకు కబడ్డీ పోటీ పెట్టాడు బిగ్‌బాస్‌. టాలీవుడ్‌ ఫాంటసీస్‌, టాలీవుడ్‌ డైనమిక్‌ టీమ్స్‌ పోటాపోటీగా తలపడ్డాయి. కబడ్డీ ఆటలో అమ్మాయిలు రెచ్చిపోయి మరీ ఆడారు. ఈ పోటీకి గీతూ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో టాలీవుడ్‌ డైనమిక్‌ టీమ్‌ గెలవడంతో అందులోని సభ్యులకు అన్నం, పప్పు పంపించగా వాళ్లు కడుపు నిండా ఆరగించారు.

తర్వాత రివర్స్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ టాస్క్‌ జరగ్గా దీనికి ఫైమా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో టాలీవుడ్‌ ఫాంటసిస్‌ టీమ్‌ గెలిచింది. వీరికి రోటీలు రావడంతో ఆవురావురుమని తిన్నారు. అయితే వేరే టీమ్‌ మెంబర్‌ అయిన గీతూ.. ఆదిరెడ్డి ప్లేట్‌లో నుంచి కొంత తీసుకుని తింది. ఫలితంగా బిగ్‌బాస్‌ వాళ్లిద్దరికీ పనిష్మెంట్‌ ఇచ్చాడు. బయట నుంచి అంట్ల గిన్నెలను పంపించి వాటిని శుభ్రంగా తోమాలని శిక్ష విధించాడు. చచ్చాంరా దేవుడా అనుకుంటూ గీతూ, ఆది వాటిని క్లీన్‌ చేశారు. ఫస్ట్‌ టైం అంట్లు తోమామని తెగ బాధపడిపోయారు. తర్వాత హౌస్‌మేట్స్‌ శ్రీహాన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ
విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల ఫొటోలు, వీడియోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement