
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభమై ఐదు వారాలు కావస్తున్నా కొందరి ఆటతీరు మాత్రం ఇప్పటికీ బయటపడటం లేదు. అసలు వాళ్లు ఎందుకు ఉన్నారో కూడా అర్థం కావడం లేదు. ఆ జాబితాలో రోహిత్- మెరీనా జంట ఉంది. తామేంటో నిరూపించుకునే అవకాశం రావడం లేదో మరి అవకాశాలు వచ్చినా ప్రూవ్ చేసుకోవడం లేదో కానీ ఇన్నివారాల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇచ్చిందే లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్కుల్లో, కొట్లాటల దగ్గరా ఎక్కడా పెద్దగా కనిపించలేదు.
అయితే విచిత్రంగా ఈరోజు నామినేషన్స్‌లో రోహిత్‌కు కోపమొచ్చింది. ప్రతిదానికీ రివ్యూ ఇచ్చే ఆదిరెడ్డితో గొడవపడ్డాడు. కళ్లు పెద్దవి చేస్తూ అతడి మీదమీదకు వెళ్లాడు. అటు సూర్యకు, గీతూకు.. ఇటు కీర్తి, ఇనయకు మధ్య కూడా పెద్ద వాగ్వాదమే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
చదవండి: బిగ్‌బాస్: నామినేషన్స్‌లో తొమ్మిది మంది
ఈ దీపావళికి సందడి చేసే చిత్రాలివే!
Comments
Please login to add a commentAdd a comment