
హౌస్‌మేట్స్ మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడు బిగ్‌బాస్. ఎంటర్‌టైన్ చేయండ్రా బాబూ అంటే సోది కబుర్లు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నారని కంటెస్టంట్లపై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. వీళ్ల కడుపు మాడ్చితేనే దారికొస్తారని డిసైడ్ అయిన బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న వంటసామాగ్రి అంతా లాగేసుకున్నాడు. మళ్లీ అంతలోనే ఆకలితో అలమటిస్తున్న ఇంటిసభ్యులను చూసి జాలిపడిన ఆయన హౌస్‌లోకి ఫుడ్ పంపించాడు. కాకపోతే దాన్ని దక్కించుకోవాలంటే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. అలా కబడ్డీ, రివర్స్ టగ్ ఆఫ్ వార్ టాస్కులిచ్చాడు.
గెలిచిన టీమ్ సభ్యులు తమ ఆహారాన్ని మిగతా టీమ్ సభ్యులతో షేర్ చేసుకోకూడదని ముందుగానే హెచ్చరించాడు. అయినా ఇదేమీ పట్టించుకోని గీతూ.. గెలిచిన టీమ్ మెంబర్ అయిన ఆది రెడ్డి ప్లేటులోని ఆహారాన్ని కొంత తీసుకుని తినేసింది. దీంతో బిగ్‌బాస్.. తన మాట పెడచెవిన పెట్టిన ఇద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. బయట నుంచి అంట్ల పాత్రలు పంపించి వాటిని కడగమని ఆదేశించాడు. చేసినదానికి అనుభవించక తప్పుతుందా? అనుకుంటూ ఆది రెడ్డి, గీతూ.. ఇద్దరూ అంట్లు తోమారు. ఆ తర్వాత ఇద్దరూ తెగ బాధపడ్డారు. ఇంతవరకు ఎప్పుడూ అంట్లు తోమిందే లేదు, ఇదేం టార్చర్‌రా బాబు అని తలలు పట్టుకున్నారు.
చదవండి: ఆది రెడ్డి ముఖంపై కాళ్లూపిన గీతూ
విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు
Comments
Please login to add a commentAdd a comment