బిగ్‌బాస్ ఆరో సీజన్ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ఇందులో బాగంగా మొదటగా ఆదిరెడ్డి ఫ్యామిలీ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆదిరెడ్డి తన భార్య కవిత, కూతురు అద్వితను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. కూతురికి అన్నం తినిపించాడు. అనంతరం తన ఆటతీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాడు. తన డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్నామని కవిత చెప్పడంతో ఆదిరెడ్డితో సహా ఇంటి సభ్యులంతా పగలబడి నవ్వారు.
‘అందరు మంచి వాళ్లు గేమ్ వరకు కొట్టుకోండి..తింటుకోండి కానీ..’ అని కవిత ఏదో చెప్పబోతుండగా.. ‘ఏంటి నన్ను కూడా కొట్టమంటున్నావా?’ అని ఆదిరెడ్డి అంటాడు. హా..నువ్వేమైనా పెద్ద తోపా అంటూ ఆదిరెడ్డికే సెటైర్ వేసింది కవి. కేక్ కట్ చేసి కూతురు బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. భార్య, కూతురు రాకతో ఆదిరెడ్డి చాలా సంతోషంగా ఉంటే.. రేవంత్ మాత్ర తన భార్య, పుట్టబోయే బిడ్డను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు. మరి రేవంత్ ఫ్యామిలీ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తుందా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment