Bigg Boss 6 Telugu: Big Fight In Captaincy Your Goal Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రేవంత్‌పై ఫైమా ఫైర్‌, ఏడ్చేసిన ఇనయ

Published Thu, Nov 17 2022 5:08 PM | Last Updated on Thu, Nov 17 2022 6:27 PM

Bigg Boss 6 Telugu: Big Fight In Captaincy Your Goal Task - Sakshi

తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లు ఫైర్‌ మీదున్నారు. ఈ ఫైర్‌ మొదటినుంచీ ఉండుంటే బిగ్‌బాస్‌ ఇలా ప్రైజ్‌మనీ నుంచి లక్షల రూపాయలు కట్‌ చేసేవాడు కాదు. ఇప్పుడనుకునేం లాభం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. అన్నట్లుగా బోర్‌ కొట్టించినందుకు ఫలితంగా ప్రైజ్‌మనీని తగ్గించుకుంటూ పోతున్నాడు. వీళ్లకంటే నాన్‌స్టాప్‌ సీజన్‌ కంటెస్టెంట్లే నయమని నెటిజన్లు అంటున్నారంటే వీరి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ నడుస్తోంది. ఇనయ, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రోహిత్‌, రేవంత్‌ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇనయను గేమ్‌లో అవుట్‌ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్‌ను టైం చూసి దెబ్బ కొట్టాడు ఆదిరెడ్డి. తర్వాత శ్రీహాన్‌, రేవంత్‌ కలిసి ఆదిరెడ్డిని అవుట్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆది కోపంతో ఊగిపోయాడు. ఇక గేమ్‌లో రేవంత్‌, ఫైమా మధ్య ఫైట్‌ జరిగింది. వెటకారం తగ్గించుకుంటే మంచిది, నీలాగా నేను వెటకారం చేస్తే ఏడుస్తావని రేవంత్‌ చెప్పగా అమ్మో, నాకు భయమైతుంది మరి అని కౌంటరిచ్చింది ఫైమా.

పక్కనోడు సపోర్ట్‌ చేస్తే కానీ గేమ్‌ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని ఆగ్రహించాడు రేవంత్‌. నువ్వు కూడా సపోర్ట్‌తోనే ఆడుతున్నావు, సొంతగా ఆడలేదని ఫైమా అనడంతో మరింత రెచ్చిపోయాడు రేవంత్‌. నేను ఎవ్వడి సాయం తీసుకోలేదని కరాఖండిగా చెప్పాడు. ఈ మాటతో షాకైన ఆదిరెడ్డి.. మాట్లాడేటప్పుడు బ్రెయిన్‌ దగ్గర పెట్టుకో. ఇంతకుముందే మనిద్దరం ఒక టీమ్‌ అన్నట్లుగా చెప్పావు. ఇక్కడేమో శ్రీహాన్‌తో కలిసిపోయి ఆడావు. ఎంతమందితో కలిసి ఆడుతావు? అని విమర్శించాడు. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోవడాన్ని ఇనయ జీర్ణించుకోలేక ఏడ్చేసింది. మొత్తానికి ఈ వారం రేవంత్‌ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది.

చదవండి: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తారక్‌తో చేయాల్సింది
ప్రైజ్‌మనీకి భారీగా ఎసరు, కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement