Bigg Boss 6 Telugu Episode 58 Highlights:9th Week Nomination List - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సూర్యను వెన్నుపోటు పొడిచావ్‌.. ఇనయను ఆడుకున్న హౌస్‌మేట్స్‌

Published Tue, Nov 1 2022 12:33 AM | Last Updated on Tue, Nov 1 2022 8:39 AM

Bigg Boss 6 Telugu: 9th Week Nomination List - Sakshi

Bigg Boss Telugu 6, Epispde 58: ఆర్జే సూర్య ఎలిమినేషన్‌ నేటి నామినేషన్స్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఓ పక్క సూర్య కప్‌లో కాఫీ తాగుతూ అతడి జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది ఇనయ. ఆమెను చూసిన ఫైమా.. సూర్యతో మాట్లాడితే బయటకు నెగెటివ్‌గా పోతుందన్న ఆమె అతడు వెళ్లిపోతుంటే ముద్దులు పెట్టింది.. మరి అది నెగెటివ్‌గా పోదా? అంటూ గీతూతో చెప్పుకొచ్చింది. అసలు సూర్యను నామినేట్‌ చేసి అతడు బయటకు వెళ్లడానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇనయ అంటూ మెజారిటీ హౌస్‌మేట్స్‌ ఆమెకు ఒకటే నామినేషన్లు గుద్దారు. మరి ఇంటిసభ్యులు ఎవరెవర్ని నామినేట్‌ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదవాల్సిందే!

నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్‌ ఎదుట ఉన్న దిష్టిబొమ్మలపై కుండలు పగలగొట్టాలని ఆదేశించాడు బిగ్‌బాస్‌. మొదటగా వచ్చిన గీతూ.. నీ భర్తతో కలిసి ఆడుతున్నావంటూ మెరీనాను, నువ్వో కన్‌ఫ్యూజన్‌ పర్స్‌ అంటూ రోహిత్‌ను నామినేట్‌ చేసింది. రేవంత్‌.. ఇనయను నామినేట్‌ చేసే క్రమంలో వీరి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఇప్పటివరకు సూర్య నామినేషన్‌లోకి రాలేదు, గుద్దితే వెళ్లిపోతాడు. చాలా సేఫ్‌గా ఆడుతున్నాడు.. అని నువ్వే అన్నావు కదా అంటూ ఇనయను ఇరికించేశాడు. నేనలా అనలేదు, సూర్య గురించి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదని ఫైర్‌ అయింది ఇనయ. ఇక తనను ఛీ, తూ అనేసిందని కీర్తి కుండ పగలగొట్టాడు రేవంత్‌.

ఈ హౌస్‌లో ఇనయ మోస్ట్‌ ఫేకః ఫేకస్య ఫేకోభ్యః అన్నాడు ఆది. సూర్యను నామినేట్‌ చేయడం, అతడు వెళ్లిపోయినప్పుడు బాధపెడటం? ఇదంతా ఫేక్‌ అన్నాడు. విన్నర్‌ క్వాలిటీస్‌ సహజంగా ఉండాలే తప్ప కావాలని ఇముడ్చుకోవాలని చూస్తున్నావనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. అవును నేను విన్నర్‌ అంటూ రెచ్చిపోయింది. వీరి గొడవ చూసి శ్రీసత్య, గీతూ, శ్రీహాన్‌, రేవంత్‌ పడీపడీ నవ్వారు. తర్వాత రేవంత్‌ కుండ పగలగొట్టాడు ఆది.

గేమ్‌లో మమ్మల్ని పర్సనల్‌గా రెచ్చగొట్టావ్‌. అలాగే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో నాకు ఓటేసి ఇప్పుడేమో నా గేమ్‌ అర్థం కావట్లేదని నామినేట్‌ చేయడం సిల్లీగా అనిపించిందంటూ గీతూ దిష్టిబొమ్మ కుండ పగలగొట్టాడు రోహిత్‌. కరెక్ట్‌గా పాయింట్‌ టూ పాయింట్‌ మాట్లాడటంతో గీతూ నోరు మూయించాడు. తర్వాత శ్రీసత్యను నామినేట్‌ చేశాడు. మంచితనం ఎక్కువైందంటూ బాలాదిత్యను, ప్రవర్తన నచ్చట్లేదంటూ ఇనయను నామినేట్‌ చేసింది ఫైమా. సూర్య పేరు రాసుకున్నప్పుడు, సూర్యుడి బొమ్మ వేసుకున్నప్పుడు, అతడికి ముద్దులు పెట్టినప్పుడు బయటకు నెగెటివ్‌ అవుతావని అనిపించలేదా? అని ఫైమా నిలదీయగా సూర్య అంటే నాకిష్టం అంది ఇనయ.

సూర్య నీకడ్డం అవుతాడని నామినేట్‌ చేసి పంపించావు. అతడికి వెన్నుపోటు పొడిచావంటూ ఆదిరెడ్డి పదే పదే అనడంతో ఇనయ కంట్లో నీళ్లు తిరిగినా అది బయటపడకుండా కంట్రోల్‌ చేసుకుంది. ఫ్రెండ్‌షిప్‌లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరంటూ ఇనయను నామినేట్‌ చేశాడు శ్రీహాన్‌. పైగా తను కెప్టెన్‌ కావడంతో ఈరోజు నువ్వు నన్ను నామినేట్‌ చేయలేవు అని చివర్లో ఆనందపడ్డాడు.

మెరీనా - శ్రీసత్య, గీతూ; బాలాదిత్య - శ్రీసత్య, ఫైమా; కీర్తి - గీతూ, రేవంత్‌; వాసంతి - గీతూ, రేవంత్‌; రాజ్‌ - గీతూ, బాలాదిత్య; సత్య - బాలాదిత్య, ఇనయలను నామినేట్‌ చేశారు. ఫైనల్‌గా ఈ వారం బాలాదిత్య, గీతూ, ఇనయ, రేవంత్‌, ఫైమా, శ్రీసత్య, కీర్తి, రోహిత్‌, ఆది రెడ్డి, మెరీనా నామినేషన్‌లో ఉన్నారు.

చదవండి: మూడు నెలలుగా కోమాలో, నటుడి భార్య మృతి
లవ్‌లో ఉన్నాం.. హీరోహీరోయిన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement