![Bigg Boss Telugu 6: Adi Reddy, Revanth Nominates Inaya Sultana - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/31/srihantt.jpg.webp?itok=3gTEN759)
అపరిచితురాలులా మారిపోయిన ఇనయకు నామినేషన్స్‌లో గట్టి దెబ్బే తగిలేట్లు కనిపిస్తోంది. కారణం.. ఇనయకు మొదట్లో ఆర్జే సూర్యతో అంతగా పడలేదు. కానీ ఎప్పుడైతే ఆరోహి వెళ్లిపోయిందో అప్పుడు అతడితో బాగా క్లోజ్ అయింది. బావా అంటూ వెనకాలే తిరుగుతూ అతడే తన ప్రపంచం అన్నట్లుగా మారిపోయింది. మళ్లీ అంతలోనే నీతో ఫ్రెండ్‌షిప్ కట్ అంటూ నామినేట్ చేసింది. ఆమె నామినేట్ చేసిన వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. సూర్య వెళ్లిపోవడాన్ని ఇనయ తట్టుకోలేక బోరుమని ఏడ్చింది. మరి వెళ్లిపోతే అంత బాధపడేదానివి ఎందుకని నామినేట్ చేశావ్.. అంటూ ఇనయపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ముప్పుతిప్పలు పెట్టారు హౌస్‌మేట్స్.
ఆదిరెడ్డి అయితే.. ఫేకః.. ఫేకస్య.. ఫేకోభ్యః అంటూ ఇనయపై సెటైర్లు వేశాడు. సూర్యను నామినేట్ చేసింది నువ్వే.. ఎలిమినేషన్‌కు కారణమూ నువ్వే! మరి అతను వెళ్లిపోతే బాధపడతామన్నప్పుడు ఎందుకు నామినేట్ చేయడం? అని పాయింట్ లాగాడు. దీనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని ఇనయ అది నా ఇష్టమని బదులిచ్చింది. ఇక రేవంత్ కూడా ఇది యాక్టింగా? ఫేకా? అని అడగ్గా.. సూర్య గురించి ఇక్కడ తీసుకురానవసరం లేదు అంటూ ఫైర్ అయింది ఇనయ. విన్నర్ క్వాలిటీస్ మనలో ఉండాలే తప్ప.. కావాలని వాటిని మనలో పెట్టుకుని చేయకూడదని ఆదిరెడ్డి అనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. విన్నర్ క్వాలిటీస్ అన్నారు కదా, నేనే విన్నర్.. బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అని గొంతెత్తి అరిచింది. దీంతో ఆదిరెడ్డి, శ్రీహాన్ నవ్వాపుకోలేకపోయారు.
చదవండి: గీతూ పెద్ద ఇడియట్, ఇనయ, ఫైమాకు బలుపెక్కువ
తల్లి కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య
Comments
Please login to add a commentAdd a comment