Bigg Boss 6 Telugu Episode 65 Highlights:Tenth Week Nominations List - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu: శ్రీసత్య బ్యాచ్‌కు బిగ్‌బాస్‌ వార్నింగ్‌, బిగ్‌బాస్‌ను నామినేట్‌ చేయాలన్న ఆది

Published Mon, Nov 7 2022 11:59 PM | Last Updated on Tue, Nov 8 2022 9:20 AM

Bigg Boss 6 Telugu: Tenth Week Nominations List - Sakshi

Bigg Boss Telugu 6, Episode 65: చిత్తూరు చిరుత గీతూ రాయల్‌ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌ షో మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. గేమ్‌ ఆడుతున్న గీతూ ఎందుకు ఎలిమినేట్‌ అయిందో అర్థం కాక జుట్టు పీక్కున్నారు మిగతా కంటెస్టెంట్లు. బిగ్‌బాస్‌ షో పదోవారంలోకి ఎంటరయ్యేసరికి హౌస్‌లో పన్నెండు మంది మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు నామినేట్‌ అయ్యారు? ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల ముఖాలపై గ్లాసు నీళ్లు పోయాన్నాడు బిగ్‌బాస్‌. కెప్టెన్‌ శ్రీసత్యను నామినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టమని ఆదేశించాడు.

శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయ
ఆదిరెడ్డి.. ఇనయ, రేవంత్‌
వాసంతి.. ఇనయ, ఆదిరెడ్డి
రేవంత్‌.. వాసంతి, ఆదిరెడ్డి
కీర్తి.. శ్రీహాన్‌, ఇనయ
బాలాదిత్య.. శ్రీహాన్‌, ఇనయ
మెరీనా.. ఆది రెడ్డి, ఇనయ
రాజ్‌.. ఇనయ, శ్రీహాన్‌
రోహిత్‌.. రేవంత్‌, ఆదిరెడ్డి
ఫైమా.. వాసంతి, మెరీనా
శ్రీహాన్‌.. కీర్తి, ఇనయ
ఇనయ.. ఫైమా, శ్రీహాన్‌లను నామినేట్‌ చేసింది. అత్యధికంగా ఇనయకు ఎక్కువ నామినేషన్‌ ఓట్లు పడ్డాయి. 

గేమ్‌ కసిగా ఆడటం తప్పు కాదు, కానీ కంటెస్టెంట్ల మీద అగ్రెసివ్‌ చూపించకు. నీ వల్ల ఇప్పటికీ నా చేయి నొప్పిగా ఉంది. ఇనయను లాగి పడేశావు. అలాగే ఎంత కోపంలో ఉన్నా కూడా నోరు జారకూడదు అని హెచ్చరించాడు ఆదిరెడ్డి. అవతలివాళ్లను హర్ట్‌ చేసేంత కసి మంచిది కాదు అని సలహా ఇచ్చాడు.

మిషన్‌ పాజిబుల్‌ టాస్క్‌లో గీతూ చేసిన పనికి ఆదిరెడ్డి మైక్‌ విసిరేయడంతో అతడి టీమ్‌ గెలుపుకు ఒక దూరంలో ఆగిపోయింది. ఇదే కారణం చెప్పి బ్లూ టీమ్‌లోని సభ్యులు అతడిని నామినేట్‌ చేశారు. దీంతో ఆది.. 'తప్పంతా బిగ్‌బాస్‌ది. ఆయన్ను నామినేట్‌ చేయాలి. మన టీమ్‌కు బిగ్‌బాస్‌ అన్యాయం చేశాడు. మన టీమ్‌ ఓడిపోవడానికి బిగ్‌బాసే కారణం' అని ఫ్రస్టేట్‌ అయ్యాడు.

ఓపక్క నామినేషన్స్‌ జరుగుతుంటే శ్రీహాన్‌, శ్రీసత్య, రేవంత్‌ వెకిలి చేష్టలు చేస్తూ పడీపడీ నవ్వుతుండటంతో బిగ్‌బాస్‌ సీరియసయ్యాడు. ఆ జోకేంటో బయటకు చెప్తే మిగతావాళ్లు కూడా నవ్వుతారు అని గద్దించాడు. నామినేషన్‌ ప్రక్రియకున్న మర్యాదను కనీసం కెప్టెన్‌ అయినా కాపాడితే బాగుంటుందనడంతో శ్రీసత్య సారీ చెప్పింది.

ఇక ఇనయ, ఫైమాలు నామినేషన్‌లో వాదులాటకు దిగారు. నువ్వు నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదని ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వు వెనక మాట్లాడుతావు, ఫేక్‌.. ఈ హౌస్‌లో ఎవరికీ నచ్చవు. సినిమాలో యాక్టింగ్‌ చేయు, ఇక్కడ కాదు. మనిషిని బ్లేమ్‌ చేయాలనుకుంటున్నావు, సోది ముఖం అంటూ ఇనయను నానా తిట్టిపోసింది ఫైమా. ఆమె అనే మాటలకు రివర్స్‌ కౌంటరిస్తూ పోయింది ఇనయ. ఫైనల్‌గా పదో వారం బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమా, వాసంతి, రేవంత్‌, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, ఇనయ నామినేట్‌ అయ్యారు.

చదవండి: చచ్చేదాకా రుణపడి ఉంటా: గీతూ పోస్ట్‌ వైరల్‌
కంటెంట్‌ క్వీన్‌ గీతూ ఎలిమినేషన్‌కు ఇవే కారణాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement