బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా ఆడి తీరాల్సిందే.. ఆడి గెలుస్తావో, ఆట మొదట్లోనే ఓడిపోతావో.. అదంతా నీ ఇష్టం. కానీ నాకు నచ్చదు, నాకు అక్కర్లేదు, అసలు ఆడేవాళ్లే వేస్ట్ అని పోజులు కొట్టడానికి వీల్లేదు. ఈ వైఖరిని బిగ్‌బాస్ అస్సలు సహించడు. ఇంతకీ ఎవరి కోసం చెప్తున్నామో ఈపాటికే మీకర్థమై ఉంటుంది. ఇంకెవరు? రివ్యూయర్ ఆదిరెడ్డి గురించే.. ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు గేమ్ ఇచ్చినప్పుడు కూడా ఇదంతా అనవసరం అన్నట్లుగా మాట్లాడాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడైతే నేను ఆడను, నాకు అవసరమే లేదని దర్జాగా కూర్చున్నాడు. టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి అని అవతలివాళ్లు చెప్పినా ఆడకపోవడమే నా గేమ్ అని అతి తెలివి ప్రదర్శించాడు. చివరికి ఈరోజు నాగార్జున చేతిలో చీవాట్లు తిన్నాడు.
'బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి కానీ అడ్డమైన కారణాలు చెప్పి ఆడకుండా ఉండొద్దు. నువ్వే ఆ టాస్క్ గెలిచుంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాయంతో జెన్యూన్ కంటెస్టెంట్ ఎలిమినేషన్‌ను ఆపగలిగేవాడివి కదా!అది సపోర్ట్ చేయడం కాదా? ఆటతీరు కాదా? అలా చేసుంటే జనాలు ఎంత మెచ్చుకునేవారు. అదంతా పక్కనపెట్టి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అంటావా? ఆ పాస్ ఎవరికి వస్తే వారికి ఓట్లు రావా? నువ్వేమైనా తోపా? తురుమా? ఆడియన్స్ ఏం అనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి అని ఫైర్ అయ్యాడు. నీ తీరు మార్చుకో, లేదంటే ప్రేక్షకులే నిన్ను బయటకు పంపించేస్తార'ని హెచ్చరించాడు. దీంతో ఆదిరెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు.
చదవండి: టాప్ 10లో నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్
పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, ఒక్కరోజు బతికినా చాలు
Comments
Please login to add a commentAdd a comment