Bigg Boss 6 Telugu Latest Promo: Words War Between Inaya And Adi Reddy In 11th Week Nominations - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: బూతు మాట్లాడాడంటూ రోహిత్‌పై చెత్త వేసిన ఫైమా, నామినేషన్స్‌లో ఉన్నది వాళ్లే!

Nov 14 2022 3:43 PM | Updated on Nov 14 2022 4:21 PM

Bigg Boss 6 Telugu: 11th Week Nominations List - Sakshi

మొదటిసారి ఆదిరెడ్డి.. తానింతవరకు నామినేట్‌ చేయని ఇంటిసభ్యులైన శ్రీహాన్‌, రోహిత్‌లను సెలక్ట్‌ చేసుకున్నాడు. ఫైమా.. బాతూ మాట్లాడాడంటూ రోహిత్‌పై చెమ్మ

నామినేషన్స్‌ ఊహించగలమేమో కానీ ఎలిమినేషన్‌ మాత్రం ఊహించలేకున్నాం. ఈ మధ్య అనుకోని కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్‌ అవడంతో ప్రస్తుతం హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. తాజాగా వీరందరూ నామినేషన్స్‌ ప్రక్రియలో పాల్గొన్న ప్రోమో రిలీజైంది. ఇందులో నామినేట్‌ చేయాలనుకున్న ఇంటిసభ్యులపై చెత్తను గుమ్మరించాల్సి ఉంటుంది.

మొదటిసారి ఆదిరెడ్డి.. తానింతవరకు నామినేట్‌ చేయని ఇంటిసభ్యులైన శ్రీహాన్‌, రోహిత్‌లను సెలక్ట్‌ చేసుకున్నాడు. బాతూ మాట్లాడాడంటూ రోహిత్‌పై చెత్త గుమ్మరించింది ఫైమా. ఎప్పటిలాగే శ్రీహాన్‌.. కీర్తిని నామినేట్‌ చేశాడు. ఇకపోతే శ్రీహాన్‌- ఇనయల గొడవ గాలి మళ్లి ఆది- ఇనయల గొడవగా మారింది. ఈ మధ్య వీరిద్దరు ఎక్కువ కొట్లాడుకుంటున్నారు. అయితే ఈవారం ఇనయను నామినేట్‌ చేయలేకపోవడంతో ఆది నెక్స్ట్‌ వీక్‌ మాత్రం తననే నామినేట్‌ చేస్తానని స్పష్టం చేశాడు. బిగ్‌బాస్‌ హెచ్చరించినా సరే శ్రీసత్య, శ్రీహాన్‌, రేవంత్‌ నామినేషన్‌లో ముసిముసి నవ్వులు నవ్వుతుండటం గమనార్హం. ఇక ఈ వారం కెప్టెన్‌ ఫైమా మినహా అందరూ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఎక్కువమంది రోహిత్‌, ఇనయలనే టార్గెట్‌ చేశారు.

చదవండి: వాసంతి ఎలిమినేట్‌, ఆ ముగ్గురే తన ఫేక్‌ ఫ్రెండ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement