Bigg Boss 6 Telugu Promo: Fight Between Inaya And Adi Reddy In 11th Week Captaincy Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: అది నిరూపిస్తే బిగ్‌బాస్‌ వదిలి వెళ్లిపోతా: ఆదిరెడ్డి సవాల్‌

Published Fri, Nov 11 2022 3:50 PM | Last Updated on Fri, Nov 11 2022 4:57 PM

Bigg Boss 6 Telugu: It is Final Round of 11th Week Captaincy Task - Sakshi

గీతూ అలానే ఇద్దరిని గెలిపించి వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు స్టార్ట్‌ చేస్తున్నారు అని విమర్శలు గుప్పించింది. దీనికి ఆది.. నేను ఫైమాతో ప్లాన్‌ చేసి ఆడినట్లు తేలితే బిగ్‌బాస్‌ నుంచే వెళ్లిపోతానని శపథం

బిగ్‌బాస్‌ హౌస్‌లో పదకొండో వారం కెప్టెన్‌గా ఫైమా ఎన్నికైనట్లు ఆల్‌రెడీ లైవ్‌లో ప్రసారమైంది. కానీ ప్రధాన ఎపిసోడ్‌లో మాత్రం ఇంకా కెప్టెన్సీ పోటీనే చూపిస్తూ సాగదీస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో అయోమయం రేవంత్‌ను సంచాలక్‌గా పెట్టడంతో ఆటను గందరగోళం చేసి పడేశాడు. కీర్తి సర్కిల్‌లో నుంచి కాళ్లు బయటపెట్టినా ఆమెను సేవ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి కీర్తి బ్యాగు కింద పెట్టడంతో ఆమెను రౌండ్‌ నుంచి ఎలిమినేట్‌ చేశాడు.

అలాగే ఫైమా సర్కిల్‌ దాటి బయటకు వచ్చినా తను అవుట్‌ అని ప్రకటించలేదు. గోనెసంచిని చేత్తో పట్టుకోవద్దని రూల్‌ పెట్టిన రేవంత్‌.. ఆదిరెడ్డి తన మోచేత్తో బ్యాగును పట్టుకుంటే శిలా విగ్రహంలా చూస్తూ ఉండిపోయాడు. రూల్స్‌ కరెక్ట్‌గా ఫాలో అయిన రోహిత్‌ను అవుట్‌ చేశాడు. ఇలా రేవంత్‌ కన్ఫ్యూజన్‌తో సరిగ్గా ఆడినవారు పోటీనుంచి వైదొలగిపోగా ఫైమా కెప్టెన్‌గా అవతరించింది.

ఇకపోతే కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్‌ చేసుకున్నారని ఇనయ.. ఆదిరెడ్డి, ఫైమాలపై మండిపడింది. గీతూ అలానే ఇద్దరిని గెలిపించి వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు స్టార్ట్‌ చేస్తున్నారు అని విమర్శలు గుప్పించింది. దీనికి ఆది.. నేను ఫైమాతో ప్లాన్‌ చేసి ఆడినట్లు తేలితే బిగ్‌బాస్‌ నుంచే వెళ్లిపోతానని శపథం చేశాడు.

చదవండి: రేవంత్‌ చెత్త సంచాలక్‌, రోహిత్‌కు తీవ్ర అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement