
Bigg Boss 5 Telugu Buzz: Kajal Comments On Shannu And Sunny: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి స్ట్రాటజీ మంత్రం జపం చేసిన కాజల్ 14వ వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. టాప్ 5లో ఉంటే అంతే చాలనుకున్న ఆమె కల కలగానే మిగిలిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది.
'హౌస్‌లో అందరూ నన్ను నెగెటివ్‌గా చూశారు. నెగెటివిటీకి మారు పేరు అన్నారు. షణ్ముక్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు ఆగిపోతాయన్నాడు.. ఆ మాట నన్ను చాలా బాధపెట్టింది' అని విచారం వ్యక్తం చేసింది కాజల్. షణ్ముఖ్.. నేను ఏదైనా మాట అంటే చాలు, అందులో నుంచి ఒక నెగెటివ్ స్టేట్‌మెంట్ తీస్తాడు, అది నాకు నచ్చేదే కాదని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ ఎప్పుడూ నీ స్ట్రాటజీలు అన్నీ తెలిసిపోతాయ్ అంటాడు, అది నిజమేనా? అన్న అరియానా ప్రశ్నకు.. అతడు నా వెనకాల రియాక్ట్ అయ్యాడు. ముందు రియాక్ట్ అయ్యుంటే అప్పుడే ఇచ్చిపడేసేదాన్ని అని బదులిచ్చింది కాజల్. హౌస్‌లో మానస్, సన్నీ ఇద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ సన్నీ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment