జీవితమే పెద్ద ఛాలెంజ్‌, బాధగా ఉన్నా స్వీకరించాల్సిందే: అరియానా | Bigg Boss Telugu 5: Ariyana Glory About Bigg Boss Buzz Hosting | Sakshi
Sakshi News home page

Ariyana Glory: 'బిగ్‌బాస్‌ బజ్‌ చేయడం కష్టంగా ఉంది, ఎందుకంటే?'

Published Sun, Sep 12 2021 7:09 PM | Last Updated on Sun, Sep 12 2021 7:13 PM

Bigg Boss Telugu 5: Ariyana Glory About Bigg Boss Buzz Hosting - Sakshi

Ariyana Glory As Bigg Boss Buzz Host: తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా బిగ్‌బాస్‌ బజ్‌కు మహిళా కంటెస్టెంట్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోంది. నాలుగో సీజన్‌లో ఫైటర్‌గా పోరాడి టాప్‌ 5కు చేరుకున్న బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ ఈ సీజన్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ రోజు ఎలిమినేట్‌ అవనున్న కంటెస్టెంట్‌పై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది.

'బిగ్‌బాస్‌ బజ్‌ చేయడం నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే నేను హౌస్‌లో ఉన్నప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఈ రోజు ఎలిమినేట్‌ అయ్యే వ్యక్తిని ఫేస్‌ చేయబోతున్నా..  ఆ వ్యక్తి ఎవరనేది నాకు తెలీదు. హౌస్‌ నుంచి బయటకు వచ్చే వ్యక్తికి నేనిచ్చే సందేశం ఒకటే.. జీవితం చాలా పెద్దది. ప్రతి ఒక్కటి ఒక అనుభవం, ఇది చాలా పెద్ద అనుభవం. ఈ అనుభవం నుంచి జీవితాన్ని ఇంకా చూడబోతున్నారు. జీవితమే ఒక పెద్ద ఛాలెంజ్‌. బాధగా ఉన్నా దాన్ని స్వీకరించాల్సిందే' అని అరియానా చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement