
Bigg Boss Beauty Ariyana Purchase New Car: బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఓ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. కొత్త కారు కొన్నానంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన కియా కారును ఇంటికి తీసుకొచ్చినందుకు గాల్లో తేలిపోతుందీ అరియానా. బిగ్‌బాస్ నాల్గో సీజన్ సెకండ్ రన్నరప్ సోహైల్, బుల్లితెర నటుడు అమర్‌దీప్ అప్పుడే ఫ్రెండ్ కారెక్కి షికారు కూడా మొదలెట్టేశారు.
బిగ్‌బాస్‌లో సోహైల్, స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో అమర్‌దీప్ అరియానాకు క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో కొత్త కారు కొన్న సంతోషాన్ని ఆ ఇద్దరితో పంచుకుంటూ అప్పుడే షికారు మొదలెట్టేసిందీ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్ బజ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి ఇద్దరినీ అరియానా ఇంటర్వ్యూ చేయగా ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment