
బిగ్‌బాస్ నాల్గో సీజన్ చివరి రోజులు అరియానాకు కలిసి రావడంలేదనే చెప్పాలి. ఈ వారం అంతా ఈ బోల్డ్ బ్యూటీ ఏడుస్తూనే ఉంది. టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని కలిసిపోయే అరియానా, సోహైల్ ఈ వారంలో పెద్ద లొల్లి పెట్టుకున్నారు. అలాగే మోనాల్‌తో కూడా అరియానాకు గొడవ జరిగింది. అఖిల్ కూడా సోహైల్‌కు సపోర్ట్ చేస్తూ అరియానాతో కాస్త దూరంగానే ఉంటున్నాడు. ఇక ఇంట్లో అరియానాకు ప్రస్తుతం అంతో ఇంతో క్లోజ్‌గా ఉంది ఎవరంటే హారిక, అభిజిత్ అనే చెప్పాలి. అయితే చివరికి అభిజిత్‌తో కూడా అరియానాకు గొడవ జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ అవకాశం కల్పిస్తున్నాడు. చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ గెలిచిన వారికి ఓట్లు అభ్యర్థించే అవకాశం కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు ఇంటి సభ్యులకు డాన్స్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ ప్లే చేస్తున్నంతసేపు ఇంటి సభ్యులంతా స్టేజ్ మీద డాన్స్ చేయాలి. అయితే మ్యూజిక్ ఆపినప్పుడు మాత్రం స్టేజ్ మీద నుంచి ఒకరు దిగిపోవాలని కండిషన్ పెట్టాడు. దీంట్లో భాగంగా హారిక, మోనాల్, అఖిల్ ముందుగానే దిగిపోయినట్లు తెలుస్తోంది.
చివరికి అభిజిత్, సోహైల్, అరియానా మిగిలారు. మరోసారి మ్యూజిక్ ఆగిపోగా.. ముగ్గురిలో ఒకరు దిగాల్సి వచ్చింది. వీరిలో ఏ ఒక్కరు కూడా దిగేందుకు ఇష్టపడలేదు. తనకు డాన్స్ చేయాలని ఉందని, తర్వాత మ్యూజిక్ ఆగితే ఆటోమెటిక్‌గా దిగుతానని అరియానా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు నువ్వు దిగకపోతే ఎవరో ఒకరు దిగాలి కదా అని అభిజిత్ అనగా..నేను, సోహైల్ ఇద్దరం వెళ్లాం కదా అని అరియానా చెప్పింది. అలా అయితే మీరిద్దరే మాట్లాడుకోవాలని హారిక సూచించగా.. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారి సోహైల్ గరం అయ్యారు. ఇక అరియానా ఏమో నా ఒపియన్ నేను చెప్పా అంటుంది. అభిజిత్ ఇట్స్ ఓకే.. డన్ లెట్స్ గో అంటూ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. ఈ ప్రోమో చూస్తే అభి కూడా అరియానాకు కాస్త దూరమయినట్లే కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందో. మరి అరియానా,అభి కలిశారా లేదో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్‌లో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment