Bigg Boss 4 Telugu Winner: రెండో స్థానంలో అభిజిత్ | Final Voting, Abhijeet Ranked in 2nd Place, Ariyana Glory in First Place in Poll - Sakshi
Sakshi News home page

ఓటింగ్‌లో అభిజిత్‌ను దాటేసిన అరియానా!

Published Wed, Dec 16 2020 5:55 PM | Last Updated on Wed, Dec 16 2020 10:15 PM

Bigg Boss 4 Telugu: Abhijeet In Second Place For Final Voting - Sakshi

సెంచ‌రీ ఎపిసోడ్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ విజేత ఎవ‌రనేది నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రు విజేతగా నిలుస్తార‌ని ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ వంటి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నిర్వ‌హిస్తున్న పోల్స్‌లో అభిజిత్ ఎక్కువ ఓట్ల‌తో ముందు వ‌రుస‌లో ఉన్నాడు. ఏ అన‌ఫీషియ‌ల్ పోల్ చూసినా సుమారు 50 శాతం ఓట్లు  అభిజిత్‌కే ప‌డుతున్నాయి. త‌ర్వాతి స్థానంలో సోహైల్ ఉంటుండ‌గా అరియానా మూడో ప్లేస్‌లో ఉంది. కొన్నిసార్లు వీరిద్ద‌రి స్థానాలు తారుమారవుతూ వ‌స్తున్నాయి. కానీ అభి మాత్రం ఏ పోల్ చూసినా మొద‌టి స్థానం నుంచి క‌ద‌ల‌డ‌మే లేదు. ఇక అఖిల్‌, హారిక వ‌రుస‌గా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. (చ‌దవండి: శ్రీముఖి టాటూలు నిజ‌మైన‌వా? గ‌్రాఫిక్సా?)

అయితే తాజాగా కొన్నింటి పోల్స్‌లో అరియానా ఏకంగా రెండు స్థానాలు ఎగ‌బాకి మొద‌టి స్థానంలో పాగా వేసిన‌ట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తొలి స్థానం నుంచి అంగుళం కూడా క‌ద‌ల‌ని అభిని ఆమె వెన‌క్కు నెట్టేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మ‌రి ఇదెంత‌వ‌ర‌కు నిజ‌మో తెలీదు కానీ ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 50 శాతం ఓటింగ్‌తో ముందు వరుస‌లో ఉన్న అభి సెకండ్ ప్లేస్‌కు రావ‌డానికి ఛాన్సే లేద‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. మ‌రికొంద‌రేమో అభికి ఓట్లు ప‌డేందుకు ఇలాంటి కొత్త ట్రిక్కులు ప్లే చేస్తున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. నిమిషానికోసారి స్థానాలు మారిపోయే ఈ ఓటింగ్ పోల్స్‌ను పూర్తిగా న‌మ్మ‌లేమ‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా బ‌య‌ట న‌డుస్తున్న టాక్ ప్ర‌కారం అభిజిత్ విజేత‌గా నిలిచేందుకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. లేదంటే సోహైల్ ట్రోఫీ ఎగ‌రేసుకుపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఏదైనా ట్విస్టులు చోటుచేసుకుంటే మాత్రం అరియానా విన్న‌ర్ లేదా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచేందుకు ఆస్కార‌ముంది. (చ‌దవండి: మోనాల్ రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement