బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్సీ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. ఆయన ఎలిమినేట్ అవుతూ తన కెప్టెన్సీని మెహబూబ్‌కు ధార పోశాడు కానీ ఇమ్యూనిటీ మాత్రం అందలేదు. ఇక నాగ్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్‌లో గెలిచిన అవినాష్‌కు నామినేషన్ నుంచి మినహాయింపు లభించింది. కెప్టెన్‌గా ఇంట్లో కఠిన రూల్స్ అమలు చేసిన అరియానాను ఇంటిసభ్యులందరూ టార్గెట్ చేశారు. ఇక అఖిల్ కూడా క్లోజ్‌గా ఉంటున్న అభిజిత్‌ను నామినేట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..
పుణ్యం ఉంటుంది, పంపించేయండి: అరియానా
అమ్మ రాజశేఖర్ వెళ్లిపోయినందుకు సోహైల్, మెహబూబ్ గుక్కపెట్టి ఏడ్చారు. అటు అరియానా కూడా తనను ఎందుకు ఇంకా ఒంటరి చేస్తున్నారు అంటూ బిగ్‌బాస్‌ను నిలదీసింది. "నాకుండాలనిపించట్లేదు, పంపించేయండి. మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు, ఇంత మందిని ఫేస్ చేయలేను, మా ఇంటికెళ్లిపోతా. వీరెవరూ నాకు నచ్చట్లేదు, మీకు పుణ్యం వస్తుంది నన్ను పంపించేయండి" అంటూ బోరున విలపిస్తూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. (చదవండి: శభాష్ అరియానా, నీకో న్యాయం, ఎదుటోడికో న్యాయం)
ప్యాకేజీ అనడం నచ్చలేదు: అవినాష్
హిందీ పాట పాడినందుకు మోనాల్‌ను జైల్లో వేశారు. కానీ నామినేషన్ ప్రక్రియ కోసం ఆమె కాసేపటికే బయటకు వచ్చింది. పదోవారం నామినేషన్ ప్రక్రియ మెహబూబ్‌తో షురూ అయింది. అతడు వచ్చీరాగానే.. కొంతమంది కంఫర్ట్ కోసం కెప్టెన్‌గా అందరికీ సమానంగా పనులు ఇవ్వలేదని అరియానాను, నీతో ఇప్పటికీ ఓ బంధం అనేది ఏర్పడలేదంటూ హారికను నామినేట్ చేశాడు. తర్వాత హారిక.. తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పినా టీ స్టాండ్ టాస్కులో ముఖాన నీళ్లు విసిరి కొట్టిందని అరియానా, ఆపై మెహబూబ్ తల మీద బాటిల్ పగలగొట్టింది, ఇక అవినాష్.. తనను అరియానాను ప్యాకేజ్ అనడం నచ్చలేదని హారికను, తన పని నచ్చడం లేదని మోనాల్‌ను నామినేట్ చేశాడు.
కొన్ని గెలవాలి, కొన్ని ఓడాలి: అభిజిత్
సోహైల్.. టాస్క్ చేసేటప్పుడు యాటిట్యూడ్ వేరే ఉంటుంది అని అరియానా, టీ స్టాండు టాస్కు నుంచి మొదట తప్పుకున్నాడని అభిజిత్ మీద బాటిల్ పగలగొట్టాడు. ఇక అభిజిత్ వంతు రాగా.. టాస్కు ఇచ్చారు కదా అని ప్రతిసారి టాస్కు నాది నాది అని చెప్పుకుంటావు, కొన్ని టాస్కులు గెలవాలి, కొన్ని ఓడిపోవాలి. అది నువ్వు అర్థం చేసుకోవాలి.. అని అరియానాను నామినేట్ చేశాడు. అయితే అందరూ టాస్కుల గురించే నామినేట్ చేస్తుంటే తాను కరెక్ట్ దారిలోనే ఉన్నాననిపిస్తోందని అరియానా కౌంటరిచ్చింది. అనంతరం రెండో బాటిల్‌ను సోహైల్ తల మీద పగలగొట్టాడు. (చదవండి: అవినాష్ జబర్దస్త్ రీఎంట్రీ ఉంటుంది)
నా మాట వినకుండా వెళ్లిపోయావు: మోనాల్
ఇక అఖిల్ కూడా టీ టీ స్టాండు టాస్కులో గివప్ చేయడం ఒక్కటే కారణమంటూ అభిజిత్‌ను.. పల్లెకు పోదాం చలో చలో టాస్కులో గడసరితనం కనబడలేదని అరియానాను నామినేట్ చేశాడు. లాస్య.. ప్రతి చిన్నదాన్ని పెద్దవిగా చూస్తున్నావని అరియానా మీద , టాస్కులో అగ్రెసివ్ అయిపోతావని మెహబూబ్ తల మీద బాటిళ్లు పగలగొట్టింది. మోనాల్.. నా మీద పగ ఉందా? నచ్చదని తెలిసినా నా మీద గుడ్డు పగలగొట్టావు. టీ స్టాండు టాస్కులో కూడా నేను బాధతో విలవిల్లాడితే 'ఏంటి, ఇలా అరుస్తుంద'ని అన్నావంటూ అరియానాను నామినేషన్‌లోకి తోసింది. ఇక సపోర్ట్ చేయమని అడగడానికి వస్తే నా మాట వినలేదు అని మెహబూబ్‌ను నామినేట్ చేసింది.
ఆ టాస్కులో కావాలనే అరిచింది: అరియానా
అందరూ తన నెత్తిన బాటిల్స్ పగలగొట్టడంతో అరియానా తట్టుకోలేకపోయింది. తన వంతు రావడంతో తనలోని ఆవేదనను కక్కేసింది. ముందుగా హారిక గురించి చెచెప్తుండగా ఆమె మధ్యలో అడ్డు చెప్పబోయింది. కానీ అరియానా హారికను మాట్లాడించేందుకు అనుమతించలేదు. నువ్వు గౌరవంతో మాట్లాడకపోతే నేను వినను అని హారిక తేల్చి చెప్పడంతో అవసరమే లేదు అని అరియానా స్పష్టం చేసింది. తనకు మోనాల్ ఫేక్ అనిపిస్తోందని, టీ స్టాండు టాస్కులో కావాలని అరిచిందని, వేరే దగ్గర ఫోకస్ ఉంటుందని ఆమె మీద బాటిల్ పగలగొట్టింది. (చదవండి: మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు)
నువ్వు తప్ప అందరూ నామినేట్ చేశారు
తర్వాత వేరే వాళ్లతో మంచిగా ఉండేందుకు ట్రై చేస్తున్నావు అని సోహైల్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ మరోసారి టామ్ అండ్ జెర్రీలా మారి గొడవ పడ్డారు. కాసేపు కీచులాడుకున్నారు. చివరికి మంచిగ మాట్లాడుకుందాం అని ఇద్దరూ ప్రామిస్ చేసుకున్నారు. మొత్తానికి అరియానా, మెహబూబ్, అభిజిత్, హారిక, మోనాల్, సోహైల్ నామినేషన్‌లో నిలిచారు. ఈ ప్రక్రియ ముగియగానే అరియానా.. నువ్వు తప్ప నన్ను అందరూ నామిట్ చేశారు. నాకూ వెళ్లిపోవాలనుంది.. అని అవినాష్‌తో చెప్పుకొచ్చింది. మరోవైపు అభిని కూల్ చేసేందుకు అఖిల్ అతడికి చాక్లెట్ ఇచ్చాడు. కానీ అభి మాత్రం అది నా ఇష్టం, టాస్కులో నేను స్వచ్ఛందంగా బయటకు వచ్చాను. రావద్దని నువ్వెలా అంటావు అంటూ బెట్టు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment