
యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా గ్లోరీ.. బిగ్‌బాస్ నాల్గో సీజన్ ద్వారా చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
యాంకర్‌గా ఎన్నో ఇంటర్వ్యూలు చేసినప్పటికీ.. రామ్‌గోపాల్ వర్మ ఇంటర్వ్యూతోనే ఆమె ఫేమస్ అయిందని చెప్పాలి
అరియానా సూటి ప్రశ్నలకు.. ఆర్జీవీ బోల్డ్ సమాధాలు ఇవ్వడంతో ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఆ ఇంటర్వ్యూ వల్లే అరియానా బిగ్‌బాస్ రియాల్టీషోలో పాల్గొనే అవకాశాన్ని పొందింది.
బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన అనంతరం అరియానా ఎక్కువ రోజులు ఉండదేమో అనుకున్నారు. కానీ అవినాష్‌తో కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఆమె షో చివరి వరకు ఉన్నారు.
బిగ్‌బాస్ హౌస్ ద్వారా అరియానా భారీ రెమ్యునరేషనే అందుకుందట. మొదట్లో వెళ్లిపోవాల్సిన ఆమె చివరి వరకు పోరాడి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది.
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక అవినాష్‌తో ఇంటర్వ్యూలు కొనసాగిస్తూ యూట్యూబ్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదించింది
ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్ బజ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తుంది. ఇక రీసెంట్‌గా అరియానా గ్లోరీ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది.
ఎప్పటి నుంచో సొంతంగా మంచి కారు కొనుక్కోవాలని చూస్తున్న అరియానా మొత్తానికి ఇప్పుడు తన కలను నెరవేర్చుకుంది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను కూడా అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment