బిగ్‌బాస్‌ : తొలిసారి అభిజిత్‌ భావోద్వేగం | Bigg Boss 4 Telugu : Ghost In Bigg Boss House | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లోకి జలజ.. గజ గజ వణికిన బోల్డ్‌ గర్ల్‌

Published Wed, Nov 25 2020 10:59 PM | Last Updated on Thu, Nov 26 2020 3:42 PM

Bigg Boss 4 Telugu : Ghost In Bigg Boss House - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌ అందరికి టాస్కులు ఇస్తూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. మరోపక్క గార్డెన్‌ ఏరియాని శ్మశానంలా మార్చేశారు. అవినాష్‌ ఘోరిపై పడుకొని ఆత్మలా నటించాడు. అదే స్మశానంలో అఖిల్‌, మోనాల్‌ డేట్‌కి వెళ్లారు. ఇంతకి దెయ్యం చేసిన హంగామా ఏంటి?. దెయ్యం ఇచ్చిన టాస్కులను ఇంటి సభ్యులు చేశారా లేదా? అసలు ఆ దెయ్యానికి హౌట్స్‌మేట్స్‌ భయపడ్డారా లేదా చదివేద్దాం

ఫేస్‌వాష్‌కి బదులు తూత్‌ పేస్ట్‌‌ వాడిన సోహైల్‌
ఉదయం ముఖం కడుక్కునే సమయంలో సోహైల్‌ పొరపాటున ఫేష్‌వాష్‌కి బదులు తూత్‌ పేస్ట్‌‌ పెట్టి వాష్‌ చేసుకున్నాడు. దీంతో అవినాష్‌, హారిక, అరియానా సోహైల్‌ని ఆటపట్టించారు. పేస్ట్ పళ్లకు పెట్టుకుంటే తెల్లగా అవుతాయి.. ముఖానికి కాదు అంటూ అవినాష్ తనదైన శైలీలో పంచ్‌ వేశాడు. ఇక ఎవిక్షన్‌ పాస్‌ రావడంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న అవినాష్‌.. ఇంటి సభ్యులందరిపై పంచ్‌లు వేస్తూ నవ్వించాడు. ఇది గమనించిన సోహైల్‌.. సేవ్‌ అవగానే మారిపోయావంటూ అవినాష్‌పై సెటైర్లు వేశాడు. ఇక అరియానా సైతం అవినాష్‌ ఊసరవెళ్లి అని, నామినేషన్‌ ఉన్నప్పుడు ఒకరకంగా.. లేకుంటే మరో రకంగా ఉంటాడని చెప్పుకొచ్చింది.


అరియానాతో అఖిల్‌ పులిహోరా.. తట్టుకోలేకపోయిన అవినాష్‌
గార్డెన్‌ ఏరియాలో కూర్చున్న అఖిల్‌ అవినాష్‌ను ఏడిపించే పనిలో పడ్డాడు. అవినాష్ చూస్తుండగా.. అరియానా భుజంపై చేసి వేసి.. ‘మేం ఫ్రెండ్స్.. ఇంకా క్లోజ్ అవుతున్నాం. నా బరువు మోయడానికి రెడీగా ఉంది.. ఒక అమ్మాయి నా బరువు మోయడానికి రెడీగా ఉంది అంటే.. మా మధ్య అసలు గ్యాప్ లేదు.. వాటర్ పోసినా కూడా కిందకి జారదు’ అంటూ అరియానాతో కలిసి అఖిల్.. అభిజిత్‌ని ఆటపట్టించాడు.

ఇది తట్టుకోలేకపోయిన అవినాష్‌.. అరియానా నువ్వు ఏమైనా బొమ్మవా.. చేతులేస్తే  ఎలా ఊరుకుంటావ్‌ అని అడగ్గా.. ఏం పర్లేదు అఖిల్‌ నువ్వు చేతులు వేయి అనడంతో అవినాష్‌కి ఏం చేయాలో తెలియక..మోనాల్‌ దగ్గరకి వెళ్లి రివర్స్‌లో పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు కానీ.. సఫలం కాలేదు. అవినాష్‌ పక్కనే కూర్చున్న మోనాల్‌ కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది చూసి అరియానా, అఖిల్‌ ఘోల్లున నవ్వారు.

నా వెనుక అహ్మదాబాద్‌ డాన్‌ ఉంది : అవినాష్‌
ఇక ఇదే విషయంపై ఇంట్లో అఖిల్‌, అరియానా, అవినాష్‌ సరదా ఇంట్లో పోట్లాడుకున్నారు. అఖిల్‌, అరియానా కలిసి అవినాష్‌ని కొడుతుండగా.. సోహైల్‌ అవినాష్‌కి మద్దతుగా నిలిచాడు. మా కరీంనగర్‌ ముద్దు బిడ్డని కొడుతారా అంటూ అఖిల్‌ని గట్టిగా పట్టుకున్నారు. అయినప్పటీకి వారు అవినాష్‌ కొడుతుండటంతో.. మోనాల్‌ దగ్గరికి పరుగగెత్తాడు. మోనాల్‌ని చూపిస్తూ.. నా వెనుక అహ్మదాబాద్‌ డాన్‌ ఉంది. ఇప్పుడు రండి అంటూ అఖిల్‌, అరియానాకు సవాల్‌ విసిరాడు. అయినప్పటీకీ అరియానా వెళ్లి అవినాష్‌ని చితక్కొట్టింది.

ఇంట్లోకి జలజ.. గజగజ వణికిన అరియానా
బిగ్‌బాస్‌ హౌస్‌లో దెయ్యం హల్‌చల్‌ చేసింది. ఇంట్లోకి దెయ్యాన్ని పంపి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే హౌజ్ మెంట్స్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇంట్లో దెయ్యాన్ని చూసి అందరి కంటే బోల్డ్‌ గర్ల్‌ అరియానానే ఎక్కువగా భయపడింది. దెయ్యం మొదటగా అరియానాకే కనిపించడంతో భయంతో బిగ్గరగా అరుస్తూ పరుగులు తీసింది. అయితే మిగతా వారు మాత్రం అంతగా భయపడలేదు. పైగా ఆ దెయ్యంపైనే జోకులు వేస్తూ నవ్వుకున్నారు. అవినాష్‌ అయితే.. ‘ ఏ దెయ్యం నీకు పెళ్లి అయిందా అని అదో రకంగా అడగ్గా.. ఎంత కరువు ప్రాంతం నుంచి వచ్చావురా అయ్యా అంటూ.. ఇజ్జత్‌ తీసింది. అయినప్పటికీ పట్టించుకొని అవినాష్‌.. తనదైన శైలీలో దెయ్యంపై పంచ్‌లు వేశాడు. ఇక దెయ్యం మా అవినాష్‌ కంటే ఘోరంగా ఉంటుందా అంటూ సోహైల్‌ అనడంతో అభిజిత్‌తో సహా అంతా ఘోల్లు నవ్వారు.

దెయ్యం.. మాస్క్‌ పెట్టుకున్నావా లేదా?
ఒక పక్క దెయ్యంపై పంచ్‌లు వేస్తూనే అవినాష్‌ భయపడ్డాడు. వాష్‌రూమ్‌కి వెళ్లడానికి కూడా హారికను తోడుగా తీసుకెళ్లాడు. హారిక మాత్రం కొంచెం కూడా భయపడకుండా ధైర్యంగా ఉంది. అవినాష్‌ వాష్‌రూంకి వెళ్లి రాగానే మరోసారి ఇంట్లో గజ్జల సౌండ్‌ వినిపించింది. దీంతో అరియానా మరోసారి భయంతో వణికిపోయింది.  హారిక మాత్రం ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ప్రతి దానికి భయపడితే వాళ్ళు నీ మీదనే ఫోకస్ చేసి ఇంకా భయపెడతారని చెప్పింది. అందుకు అరియానా నేను ఏమి భయపడటం లేదని చెప్పడంతో.. హారిక పీకినవ్ తీయ్ అంటూ మరో  కౌంటర్ ఇచ్చింది.

దెయ్యంపై పంచ్‌లే పంచ్‌లు
ఆ మిర్రర్ లో నుంచి రెండు పెద్ద చేతులు వచ్చి నిన్ను లోపలికి గుంజుకపోవాలి అని హారిక అనగా.. లాక్ రాగానే రెండు చేతులకు నేయిల్ పాలిష్ పెట్టేస్తానని అవినాష్‌ పంచ్‌ వేశాడు. అలాగే చంద్రముఖి డైలాగ్ చెప్పి అందరిని నవ్వించాడు. నేను వెంకటపతి రాజా ఈ దుర్గాష్టమికి నిన్ను అదే అంటూ.. అంటూ అవినాష్‌ చెప్పిన డైలాగ్‌కి  ఇంటి సభ్యులు పగలబడి నవ్వేశారు.

ఇదిలా ఉంటే.. ఇంట్లో దెయ్యం గొంతు వినబడింది. ‘బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులంతా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారా? అంతా సోఫా దగ్గరికి రండి’ అంటూ దెయ్యం ఇంటికి సభ్యులను ఆదేశించింది. ఇంటి సభ్యులంతా సోఫాలో కూర్చొగా.. ‘ఏంట్రా మీరంద్దరూ నాకు హాయి చెప్పరా? నేను చాలా కోపం ఉన్నా. నేను ఒక దెయ్యాన్ని. నా పేరు జలజ. మీ అందరిని నాకు ఇష్టం వచ్చినట్లు ఇబ్బందులకు గురి చేస్తానని బిగ్‌బాస్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకొని వచ్చా. బిగ్‌బాస్‌ నియమాలు అంటే నాకు ఇష్టం. ఎవరైనా బిగ్‌బాస్‌ నియామాలు ఉల్లంఘిస్తే నాకు కోపం వస్తుంది. నేను వెళ్లిపోయిన అనుకున్నారా ఇంకా పోలేదు. అరియానా నీ గొంతు చాలా బాగుంది. నీ గొంతు వినాక.. నాకే పోటీగా వస్తావేమో అని భయమేస్తుంది. రేయ్‌ అవినాష్‌.. మీ అమ్మ నీ పెళ్లి కోసం పిల్లని చూస్తుంది. మీ అమ్మకి చెప్పు నా దగ్గరు రమ్మని’ అని దెయ్యం అనడం.. అవినాష్‌ ఇప్పుడే బయటకు రా..తాళి కడతా అంటూ తనదైన శైలీలో జోక్‌ చేసి నవ్వించాడు. 

అభిజిత్‌.. ఆకులు లెక్కించు
ఇక దెయ్యం ఇంట్లో అందరికి తనకు నచ్చిన టాస్క్‌ ఇచ్చింది. మ్యూజిల్‌ వస్తే షర్ట్‌ లేకుండా డాన్స్‌ చేయాలని సోహైల్‌ని,  గార్డెన్‌ ఏరియాలో ఉన్న చెట్టు ఆకులను లెక్కించాలని అభిజిత్‌కి టాస్క్‌ ఇచ్చింది. అయితే అభిజిత్‌ మాత్రం ఈ టాస్క్‌ చేయలేమని, ఆకులు లెక్కించాలంటే అవన్ని తెంపాలని, అది బిగ్‌బాస్‌ నియమాలను ఉల్లంఘిడనం అవుతుందని మరోసారి తనదైన శైలీలో చెప్పాడు.


మోనాల్‌తో డేట్‌.. అభిజిత్‌ కంటతడి
మోనాల్‌ని అభిజిత్‌, అఖిల్‌ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌.  దానికోసం మీ ఇద్దరికీ క్విజ్‌ కాంపిటేషన్ పెట్టబడుతుందని.. దానిలో గెలిచిన వాళ్లు డేట్‌కి వెళ్తారని బిగ్ బాస్ లెటర్ పంపించడంతో అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. మోనాల్‌తో నాకు ఎటువంటి లింక్ పెట్టకండి అని నేను చెప్తూ ఉన్నా.. మళ్లీ డేట్ ఏంటి? నేను తనని ఏడిపించడం ఏంటి? నాకు అసలు ఈ టాస్క్ వద్దు.. ఈ టాస్క్‌కి నేను ఒప్పుకుంటే నేను ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్టు. అసలు మోనాల్ టాపిక్ నా దగ్గర ఉండకూడదు అనుకుంటున్నా.. మేం ఇద్దరం కలిసి మోనాల్‌ని ఏడిపించడం ఏంటి? ఇది బిగ్ డీల్‌లా అనిపిస్తుంది. నాకు ఎక్కడో కొడుతుంది. నాకు ఈ మోనాల్ అభిజిత్ ప్రజెక్షన్ వద్దు.. ఏంటి ఇది అసలు.. గజిబిజి అవుతుంది అంతా.. మోనాల్ టాపిక్ తీసుకురావొద్దని అఖిల్‌తో చెప్పా.. ప్రతిసారీ మోనాల్ టాపిక్ వచ్చిందంటే నాకు రాడ్ పడుతుంది.నా జర్నీ మొత్తంలో ఈ మోనాల్‌ టాపికే బిస్కెట్‌ అవుతుంది. నేను మోనాల్‌తో డేట్‌కి పోను బిగ్ బాస్.. నాకు ఈ టాస్క్ వద్దు బిగ్ బాస్’ అంటూ ఎమోషనల్‌ అవుతూనే బిగ్‌బాస్‌కి చిన్న వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో బిగ్ బాస్.. ఇది ఇంటి సభ్యులకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్.. దీనిలో భాగంగా టాస్క్‌లు చేయడం మీ బాధ్యత అని.. అభిజిత్ నిరాకరించిన కారణంగా అఖిల్ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పారు.

మనసు విప్పి మాట్లాడుకున్న అఖిల్‌-మోనాల్‌
అఖిల్‌తో డేట్‌ అనగానే మోనాల్‌చిరునవ్వులు చిందిస్తూ.. అందంగా ముస్తాబైంది. ఇద్దరు కలిసి గార్డెన్‌ ఏరియాలో కూర్చొని మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరినొకరి ఇష్టాలను పంచుకున్నారు. తమ తమ క్యారెక్టర్‌ ఏంటో చెప్పుకున్నారు. ఆ తరువాత నందికొండ వాగుల్లోనా  సాంగ్‌ రావడంతో ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ కనిపించారు. సోహైల్‌ షర్ట్‌ విప్పి చిందులేశాడు. మరి దెయ్యం ఇంకా ఏమేం టాస్క్‌లు ఇచ్చిందో రేపటి ఎపిసోడ్‌లో చూసేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement