
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కథ క్లైమాక్స్‌కు వచ్చింది. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనేది నేడు తేల్చనున్నారు. ఈ సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్లు ఇస్తూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ విజేతను ప్రకటించే విషయంలో ఏం ఎలాంటి ట్విస్టు ఇవ్వనున్నాడోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ గ్రాండ్ ఫినాలే షూటింగ్ మొదటి పార్ట్ శనివారమే ముగిసింది. ఇందులో ముద్దుగుమ్మల డ్యాన్సులు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల స్పెషల్ పర్ఫామెన్సులతో ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ చిత్రీకరణ ముగిసింది. నేడు విన్నర్‌ను ప్రకటించే అసలు సిసలైన ఘట్టం షూటింగ్ జరగనుంది. దీనికి స్పెషల్ గెస్ట్‌లు ఎవరొస్తున్నారనేది సస్పెన్స్‌గా ఉంచారు. అయితే ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినట్లు సోసల్ మీడియా కోడై కూస్తోంది. ఫైనల్ వీక్‌లో దేత్తడి హారికకు తక్కువ ఓట్లు వచ్చి ఐదో స్థానంలో నిలిచిందని, ఫలితంగా చోటా ప్యాకెట్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న ఆమె కల అందని ద్రాక్షగానే మిగిలినట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే: హారిక అవుట్!?)
ఆమె వెళ్లిపోయిన తర్వాత హౌస్‌లో అరియానా, సోహైల్, అభిజిత్, అఖిల్ మిగిలారు. హారిక తర్వాత అరియానాకు తక్కువ ఓట్లు పడ్డాయని వినికిడి. దీంతో నాలుగో స్థానంలో ఉన్న ఆమెను నాగార్జున ఎలిమినేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే హారిక వెళ్లాక మిగిలిన నలుగురికి నాగార్జున రూ.10 లక్షల ఆఫర్ ప్రకటించారని, కానీ వాళ్లు దాన్ని అందుకోవడానికి తిరస్కరించడంతో ఓట్ల లెక్క ప్రకారం అరియానాను పంపించేశారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. అనధికారిక పోల్స్‌లో మాత్రం అరియానా రెండు, మూడు స్థానాల్లో ఊగిసలాడింది. దీంతో గత రెండు సీజన్లలాగే మరోసారి అమ్మాయి రన్నరప్‌గా నిలుస్తుందని అంతా భావించారు. ఒకానొక సమయంలో విన్నర్ అయ్యే అవకాశాలూ లేకపోలేదనుకున్నారు. ఈ క్రమంలో అరియానా నాలుగో స్థానంలో నిలవడం చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది. అయితే తమ ఫైటర్ విన్నర్ కాకపోయినా రన్నరప్‌గానైనా నిలుస్తుందని బోల్డ్ బ్యూటీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అరియానా నిజంగా నాలుగో స్థానం దగ్గరే ఆగిపోయి టైటిల్ రేసు నుంచి తప్పుకుందా? లేదా? అనేది తెలియాలంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: బిగ్‌బాస్ : అమ్మాయిలకు ఛాన్సెంత?)