
Nataraj Master BiggBoss Telugu 5 Elimination Interview: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో నుంచి నాలుగోవారం సింహం బయటకు వచ్చేసింది. కంటెస్టెంట్లందరికీ ఒక్కో జంతువు పేరిచ్చే నటరాజ్ మాస్టర్ తనకు తాను సింహం అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే కదా! ఈ సింహం సింగిల్‌గానే షో నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా మాస్టర్ బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరేంటి? అనేది పూసగుచ్చినట్లుగా వివరించాడు. తనకు ఎవరి మీదైతే కోపం ఉందో ఇంటర్వ్యూలో వారి తాట తీసినట్లు కనిపిస్తోంది. అరియానా గ్లోరీ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడాడో చదివేయండి..
మొదటగా నటరాజ్ మాస్టర్ విశ్వతో పాటు మరో కంటెస్టెంట్ ఫొటోను కింద పడేసి కాలితో తన్నేశాడు. తన ఫ్రస్టేషన్ అంతా బయటపెడుతూ గట్టిగా అరవడంతో అరియానా ఒక్కసారిగా షాకైంది. తర్వాత మాస్టర్.. ఒక్కో కంటెస్టెంట్ గురించి మాట్లాడాడు. యాంకర్ రవి టాస్క్ వచ్చినప్పుడు నత్తలాగా, నామినేషన్స్‌లో గుంటనక్కలాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. శ్వేత.. బిగ్‌బాస్ హౌస్‌లో తనకో ప్రపంచాన్ని సృష్టించుకుందన్నాడు. ప్రియను ఫిట్టింగ్ మాస్టర్ అని పేర్కొన్నాడు. తర్వాత జెస్సీ గురించి మాట్లాడుతూ.. వీడు పిల్ల బచ్చానే కానీ, మొన్న పులిహోర కలపడానికి ప్రయత్నించగా అది పులిసిపోయింది అని నవ్వేశాడు. శ్రీరామచంద్ర ముద్దపప్పులా వచ్చాడని, అతడు యాక్ట్ చేస్తున్నాడని కుండ బద్ధలు కొట్టేశాడు.
'మీరు మైక్ ధరించండి, చెవుల్లో మాట్లాడకూడదు' అన్న హెచ్చరికలు కాజల్‌నుద్దేశించే వస్తాయని తెలిపాడు. షణ్ముఖ్ పరమానందయ్య శిష్యుడని, తెలివి ఉన్నప్పటికీ దాన్ని వాడట్లేదని పెదవి విరిచాడు. ఇక లోబోను పొగిడినట్లే పొగిడి అతడి గాలి తీసేశాడు నటరాజ్ మాస్టర్. బిగ్‌బాస్ అంత ఫుడ్ పంపిస్తున్నా లోబో డస్ట్‌బిన్‌లో ఆహారం వెతుక్కోవమేంటి? అని అరియానా ప్రశ్నించగా అదంతా డ్రామా అని నొక్కి చెప్పాడు నట్టూ. లోబో ఇంకా రవి ఇచ్చిన మాస్క్‌లోనే ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment