
బుల్లితెరపై అన్ని రియాల్టీ షోలు ఒకెత్తు అయితే... బిగ్‌బాస్ రియాల్టీ షో మరో ఎత్తు. దేశవ్యాప్తంగా ఈ షోకి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ బిగ్ రియాల్టీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. 2017లో మొదలైన మొదటి సీజన్ నుంచి 2021లో ముగిసిన ఐదో సీజన్ వరకు ‘బిగ్‌బాస్’కు ఆదరణ పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గిందే లేదు.
గతేడాది డిసెంబర్‌లో ఐదో సీజన్ ముగిసింది. ఆ తర్వాత ఆరో సిజన్‌కి మరో ఆర్నేల్లు అయినా ఆగాల్సిదిందే అనుకున్న ప్రేక్షకులకు.. గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీదే గుడ్ న్యూస్ చెప్పాడు హోస్ట్ నాగార్జున. త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని చెప్పారు. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ షోకి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్ షో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. హిందీ మాదిరే తెలుగులో కూడా బిగ్‌బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతందని తెలియడంతో... తొలి సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్‌బాస్ ఎలా ఉంటుంది? ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరిందని తెలుస్తోంది.
ఈ ఓటీటీ బిగ్‌బాస్‌లోకి కొంతమంది మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకుంటున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. వారిలో అరియానా గ్లోరి ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆమెతో మంతనాలు పూర్తయ్యాయని, మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అరియనా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. ఈ సారి ఎలాగైన ట్రోఫీ గెలిచి, మరింత ఫేమస్ కావాలని అరియానా భావిస్తోందట. అందుకే ఓటీటీ బిగ్‌బాస్‌కి ఓకే చెప్పిందట. అరియానాతో పాటు మాజీ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొత్త వారిలో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరెవరు ‘బిగ్‌బాస్’హౌస్‌లోకి అడుగుపెడతారు తెలియాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment