
బిగ్‌బాస్ షో అన్నది ఓ రకంగా విలాసవంతమైన జైలు లాంటిది. అందులో అడుగు పెట్టిన వాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకుని చివరి వరకు నిలబడితే విజేతగా అవతరిస్తారు. లేదంటే, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతుంటారు. అయితే షో తర్వాత కూడా వీరికి ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుతూనే ఉంటాయి. అందుకు తాజా ఘటన నిదర్శనం.
తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ ఈ మధ్య అనారోగ్యానికి లోనైంది. తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా బాధపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఆందోళనపడిన అభిమానులు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం కుదుటపడిందని, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది.
"నాకు జ్వరం వచ్చింది, వెళ్లిపోయింది. నన్నేం చేయలేదు. ఆ విషయంలో నాకు సంతోషంగా ఉంది. నా కోసం చాలామంది అదేపనిగా మెసేజ్‌లు చేస్తున్నారు. స్టేటస్‌లు పెడుతున్నారు. నేను వెంటనే కోలుకోవాలని కొందరైతే ఏకంగా పూజలు కూడా చేయిస్తున్నారు. నామీద ప్రేమ చూపిస్తున్న అందరికీ థ‍్యాంక్స్" అని ఈ బోల్డ్ భామ పేర్కొంది. దీంతో అరియానా తిరిగి సోషల్ మీడియాలో సందడి చేయడంతో అవినాష్, సోహైల్ సంబరపడిపోయారు.
ఇక బుల్లితెరపై అవినాష్‌తో కలిసి సందడి చేస్తున్న అరియానా యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమో వేచి చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment