సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది: శ్రీహాన్‌ | Shrihan Emotional Words About Siri Hanmanth | Sakshi
Sakshi News home page

Siri-Shrihan: సిరిని అర్థం చేసుకోవడం కష్టం, తనకు ఎవరూ సాయం చేయలేదు

Published Fri, May 13 2022 8:43 PM | Last Updated on Fri, May 13 2022 8:47 PM

Shrihan Emotional Words About Siri Hanmanth - Sakshi

బిగ్‌బాస్‌ షోతో లాభపడేవాళ్లతోపాటు నష్టపోయేవాళ్లు కూడా ఉన్నారు. ఈ షోలో అడుగుపెట్టిన కొందరికి సినిమా అవకాశాలు వస్తే మరికొందరు మాత్రం నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చారు. అలాంటివారిలో సిరి హన్మంత్‌ ఒకరు. సీరియల్స్‌, యూట్యూబ్‌ వెబ్‌సిరీస్‌తో పాపులర్‌ అయిన ఆమె హౌస్‌లో షణ్ముఖ్‌ జశ్వంత్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఆమెపై ఎక్కడలేని నెగెటివిటీ వచ్చింది. బయట తనకోసం ప్రియుడు శ్రీహాన్‌ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుందని విమర్శలు వచ్చాయి. అంతేకాదు బిగ్‌బాస్‌ దెబ్బతో షణ్ముఖ్‌- దీప్తి సునయన విడిపోయినట్లుగానే సిరి, శ్రీహాన్‌ కూడా విడిపోనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బిగ్‌బాస్‌ తర్వాత ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవుతూ రూమర్లకు చెక్‌ పెట్టేశారు. తాజాగా తన ప్రేయసిపై పొగడ్తలు కురిపించాడు శ్రీహాన్‌.

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లతో ఓ సరదా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్‌ రవి. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ చేయగా అందులో శ్రీహాన్‌ ఓ వీడియో సందేశం పంపాడు. అందులో సిరి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. 'సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే ఉంది. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు. తను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌ వచ్చి కొన్ని సాధించాలనుకుంది. యాంకరింగ్‌ చేసుకుంటూ సీరియల్స్‌, సీరియల్స్‌ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్‌బాస్‌ వరకు.. మొత్తం తన కష్టమే. ఎవ్వరూ సాయం చేసింది లేదు. ఎవరి సపోర్ట్‌ తను తీసుకుందీ లేదు. కానీ ఎంత మాట్లాడినా సిరిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ప్రముఖ సీరియల్‌ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement